ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ సిక్కోలు జిల్లా ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కోటబొమ్మాళిలోని జీయన్నపేట గ్రామానికి చెందిన కేశవరావు 43 ఏళ్ల క్రితం మావోయిస్టు దళంలో చేరాడు. పార్టీ సెంట్రల్ మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. By Kusuma 06 Oct 2024 in క్రైం ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి ఛత్తీస్‌ఘడ్ దంతెవాడలోని నారాయణపూర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 31 మంది సాయుధ యూనిఫాం ధరించిన వారు చనిపోయారు. ఇందులో 18 పురుషులు, 13 మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలట్రీ కమిటీ చీఫ్ నంబాళ్ల కేశవరావు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చూడండి: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు కేశవరావు ఎన్‌కౌంటర్‌పై సందేహాలు ఇంద్రావతి ఏరియా కమిటీ 6 బెటాలియన్‌కి చెందిన మావోయిస్టు కేశవరావు ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. దీంతో అతని స్వగ్రామంలో అలజడి నెలక్కొంది. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలంలోని జీయన్నపేట అనే గ్రామానికి చెందిన వ్యక్తే కేశవరావు. 43 ఏళ్ల క్రితం గ్రామం విడిచి వెళ్లిపోయిన కేశవరావు.. ఎన్‌కౌంటర్ అయి ఉండడని గ్రామస్థులు భావిస్తున్నారు. స్పష్టమైన ఆధారాలతో అతని ఎన్‌కౌంటర్‌పై ప్రకటన చేయాలని కేశవరావు బంధువులు కోరుతున్నారు. ఇది కూడా చూడండి: Infinix Zero Flip లాంచ్‌కి రెడీ.. ఎప్పుడంటే? #encounter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి