మహా కిలాడీలు.... నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్ పేరుతో లక్షల్లో టోకరా!

ఛత్తీస్‌గఢ్‌లో నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఓపెన్ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచ్ పేరుతో శిక్షణ, ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు దోచుకున్నారు. వేరే బ్యాంకు మేనేజర్‌కు డౌట్ వచ్చి విచారణ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
sbi

నేరగాళ్లు ఏకంగా నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఓపెన్ చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. నకిలీ బ్రాంచ్ పేరుతో పెద్దల ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లో మల్కరౌడా పోలీస్ స్టేషన్ పరిధిలో చాపోరా గ్రామంలో కొందరు దుండగులు గత నెల నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. మిగతా ఎస్‌బీఐ బ్రాంచ్‌లు ఎలా ఉంటాయో.. అలానే ఏర్పాటు చేశారు.

ఇది కూడా చూడండి: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం

ఉద్యోగాలు ఇస్తామని..

ఒరిజినల్ బ్యాంకు లాగానే కౌంటర్లు, ఫర్నిచర్ అన్ని ఏర్పాటు చేశారు. నకిలీ బ్రాంచ్ అని తెలియని ప్రజలు ఇందులో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి లావాదేవీలు చేయడం మొదలుపెట్టారు. అలాగే ప్రజలను నమ్మించి నకిలీ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తూ నిరుద్యోగులను మోసం చేశారు. ఈ విషయం ఎస్‌బీఐ దబ్రా బ్రాంచ్ మేనేజర్ తెలుసుకుని విచారణ చేశారు. దీంతో ఈ నకిలీ బ్రాంచ్ ఘటన బయట పడింది.

ఇది కూడా చూడండి: అటుకుల బతుకమ్మ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే?

ఈ దారుణమైన మోసంలో నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. ఈ బ్యాంక్‌లో కొందరికి ఇచ్చిన ఆఫర్ లెట్లర్లు కూడా నిజమైనవి లాగానే ఉన్నాయి. ఒక్కో ఉద్యోగం రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బ్రాంచ్ పేరుతో ఎంత మందిని మోసం చేశారు? డబ్బులు ఎంత వసూలు చేశారనే దాని మీద విచారణ చేపట్టారు. 

ఇది కూడా చూడండి: సిగ్గు.. సిగ్గు.. తెలుగు అకాడమి పుస్తకాలపై నిరుద్యోగులు ఫైర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు