ఛీ ఛీ..  ఏం కొడుకుల్రా మీరు..  తండ్రి శవాన్ని ముక్కలుగా నరికి

తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి ఒక భాగానికి ఒకరు, మరో భాగానికి మరోకరు అంత్యక్రియలు చేయాలని  భావించారు. చివరకు పోలీసులు అక్కడి చేరుకుని సమస్యను పరిష్కరించారు.

author-image
By Krishna
New Update
father funeral

father funeral

తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం ఎంతగా పెరిగిపోయిందంటే  తండ్రి మృతదేహాన్ని  ఏకంగా రెండు ముక్కలు చేయాలని అనుకున్నారు.  ఒక భాగానికి ఒకరు అంత్యక్రియలు నిర్వహించాలని, మరో భాగానికి మరోకరు అంత్యక్రియలు చేయాలని  భావించారు. ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలోని జాతర పోలీస్ స్టేషన్ పరిధిలోని లిధౌరా తాల్ గ్రామంలో చోటుచేసుకుంది.  ఈ విషయం తెలుసుకుని భయపడిపోయిన స్థానికులు వెంటనే  పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

ఇంతకీ ఏం జరిగిందంటే 

లిధౌరా తాల్‌కు చెందిన 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ ఫిబ్రవరి 03వ తేదీ సోమవారం రోజు ఉదయం మరణించారు. ఆయన మరణానంతరం చిన్న కుమారుడు దామోదర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, బంధువులు అతని ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు సిద్ధమయ్యారు,  ఇంతలో దామోదర్ అన్నయ్య కిషన్ సింగ్ ఘోష్ కూడా అక్కడికి చేరుకుని అతను కూడా తండ్రి అంత్యక్రియలు చేయాలని అనుకున్నాడు. అయితే కిషన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు దామోదర్ నిరాకరించాడు.  

తండ్రి చివరి వరకు తనతోనే ఉన్నాడని.. అందుకే తానే అంత్యక్రియలు చేస్తానని దామోదర్ భీష్మించి కూర్చున్నాడు.  ఈ విషయమై సోదరుల మధ్య వాగ్వాదం జరగింది. గొడవ ముగిసే వరకు  తండ్రి మృతదేహాన్ని కూడా ఇంటి బయటే ఉంచారు. అన్నదమ్ములిద్దరినీ కలిసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు, బంధువులు ఎంతగానో ప్రయత్నించినా కిషన్ సింగ్ మాత్రం అందుకు ఏమాత్రం అంగీకరించలేదు.  దీంతో తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు సోదరులు. దీంతో భయపడిపోయిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకుని పెద్ద కొడుకు  కిషన్ సింగ్ ఘోష్ కే కర్మకాండ బాధ్యతులను అప్పగించారు. 

Also Read :   Prabhas in kannappa: సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ పై ఫుల్ ట్రోల్స్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment