Peanut Allergy: యువతి ప్రాణం తీసిన పల్లీలు.. అసలేమైందంటే?

అమెరికాకి చెందిన అలిసన్ పికరింగ్ అనే 23 ఏళ్ల యువతి గత కొన్ని రోజుల నుంచి పీనట్ అలెర్జీతో బాధపడుతోంది. డేట్‌కి వెళ్లిన ఆమె తెలియక రెస్టారెంట్‌లో పీనట్ సాస్‌ను కాస్త తిన్నది. వెంటనే ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది.

New Update
peanut allergy

వేరుశెనగ బైట్ ఓ యువతి ప్రాణం తీసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అలిసన్ పికరింగ్ అనే 23 ఏళ్ల యువతి పీనట్ ఎలర్జీ వల్ల తన ప్రాణాలు కోల్పోయింది. తనకి తెలియకుండా చిన్న పల్లీ ముక్క తిన్న ఆమె అస్వస్థతకు గురై  వెంటనే మరణించింది. ఆమె నివాసానికి దగ్గరలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు డేట్ వెళ్లింది.

ఇది కూడా చూడండి: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే..

తెలియక కొంచెం పీనట్ ఉన్న పదార్థాన్ని తినడంతో..

ఎప్పుడూ కూడా అలిసన్ ఆ రెస్టారెంట్‌లో మహి మహి అనే రెసిపీని ఆర్డర్ చేస్తుంటుంది. ఎప్పటిలాగానే అదే రెసీపీని ఆర్డర్ చేసింది. అయితే ఈ రెసిపీలో కొన్ని మార్పులను ఆ రెస్టారెంట్ యాజమాన్యం చేసింది. కొత్తగా పీనట్ సాస్‌ను అందులో హోటల్ యాజమాన్యం యాడ్ చేసింది. 

ఇది కూడా చూడండి: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!

ఈ విషయం ఆమెకు తెలియక ఆ రెసిపీని కాస్త తిన్నది. దీంతో వెంటనే ఆమెకు తేడాగా అనిపించి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో  మార్గమధ్యంలోనే అలిసన్ పికరింగ్ మరణించింది. 

ఇది కూడా చూడండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్‌ ఎమోషనల్‌.. మరీ ఇంత ప్రేమనా!

అలిసన్‌కు పీనట్ అలెర్జీ సమస్య ఉంది. గత కొన్ని రోజులు నుంచి ఆమె అనాఫిలాక్టిక్ షాక్‌తో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఆమె చిన్న ముక్క పీనట్ తినడంతో ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి మరణించింది. అత్యంత ప్రమాదకరమైన అలెర్జీలో వేరుశెనగ అలెర్జీ ఒకటి. ఈ అలెర్జీ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లోనే కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. పొరపాటున చిన్న ముక్క వేరుశెనగ తింటే ఇక ఒక్కసారిగా ప్రాణాలు పోవడం మాత్రం పక్కా. 

ఇది కూడా చూడండి: 16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..

Advertisment
Advertisment
తాజా కథనాలు