బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకు బట్టలు ఆరేస్తుండగా షాక్ కొట్టడంతో తల్లి కాపాడటానికి ప్రయత్నించింది. ఈక్రమంలోనే ఆమెతో పాటు కొడుకు, కూతురు మరణించారు.

New Update
Current shock guntur

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించారు. పెదబయలు మండలంలోని ఓ కుటుంబంలో ఉన్న తల్లి, కూతరు, కొడుకు కూడా విద్యుత్ షాక్‌తో చనిపోయారు. తల్లి కోర్ర లక్ష్మి బట్టలు ఆరేయమని కుమారుడికి చెప్పింది. 13 ఏళ్ల కొడుకు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది.

ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

కొడుకును తల్లి రక్షిస్తుండగా..

దీంతో కొడుకును రక్షించడానికి ప్రయత్నిస్తుండగా తల్లికి(36), కూతురికి(10) కూడా కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందారు. ఈమెకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఒకేసారి చనిపోవడంతో కుటుంబం బోరున విలపిస్తుంది. ఆ ఇద్దరు చిన్నారులను చూస్తే గుండె తరుక్కుపోతుంది.

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

ఇదిలా ఉండగా ఇటీవల యాదాద్రిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. బస్సులోని 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి బాగానే ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. విషయం తెలుసుకుని పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ చేపట్టనున్నారు. 

ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: నాశనమైపోతార్రా.. 5 ఏళ్ల చిన్నారిని చంపి.. తల్లిపై మైనర్లు రేప్

హర్యానాలోని జింద్‌లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై నలుగురు దుండగులు దాడి చేశారు. అందులో 5ఏళ్ల చిన్నారిని చంపి చెత్తకుండీలో పడేశారు. ఆపై బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు.

New Update
Rape and murder in Jind, Haryana

కామాంధుల ఆగడాలు పెరిగిపోయాయి. ఆడది కనిపిస్తే చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రూర మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ దారుణం జరిగింది. ఇంట్లో తన ముగ్గురు బిడ్డలతో నిద్రిస్తున్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఈ ఘటన హర్యానాలోని జీంద్‌లో జరిగింది. మంగళవారం రాత్రి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో గుడిసెలో నిద్రిస్తుంది. దీంతో ఆమె భర్త లేడని తెలుసుకున్న నలుగురు దుండగులు ఆ గుడిసెలోకి వెళ్లారు. అనంతరం పిల్లలతో కలిసి నిద్రిస్తున్న బాధితురాలిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. 

అదే సమయంలో ఆ బాధితురాలితో పాటు 5 ఏళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై బాధితురాలి పై దుండగులు నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు.

ఇక గొంతునులిమి హత్య చేసిన చిన్నారి.. డెడ్ బాడీ రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. ఇక గురువారం ఆ బాధితురాలు స్పృహలోకి వచ్చి.. జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై ఎస్‌ఐ. యశ్‌వీర్ మాట్లాడుతూ.. ఇందులో నిందితుడు అమిత్‌ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని వెల్లడించారు. 

Advertisment
Advertisment
Advertisment