స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం చెందిన దారుణ ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. మనోజ్ఞ తలపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మరణించింది. స్కూల్ మెనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి నర్సరీ విద్యార్థి మృతి చెందింది. నామాపూర్‌కి చెందిన భూమయ్య, వెంకటవ్వ కూతురు మనోజ్ఞ మహర్షి స్కూల్‌లో నర్సరీ చదువుతుంది. స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్ల పాఠశాల బస్సు కింద పడి మరణించిదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. మనోజ్ఞ తలపై నుంచి బస్ టైర్ వెళ్లడంతో అక్కడిక్కడే చనిపోయింది. విద్యార్థి తల్లి ఒక వ్యవసాయ కూలీ, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి వర్క్ చేస్తుంటారు. చిన్నారి చావుతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Pahalgam Attack: నెలల తరబడి డబ్బు కూడబెట్టి కశ్మీర్ పర్యటన.. 9ఏళ్ల కొడుకు ముందే ప్రశాంత్ కలను కాలరాసిన ఉగ్రవాదులు!
పహల్గాం ఉగ్రదాడి ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నెలల తరబడి డబ్బు కూడబెట్టి ఫ్యామిలీతో కశ్మీర్ పర్యటన వెళ్లిన ప్రశాంత్‌ను 9ఏళ్ల కొడుకు, భార్యముందే కాల్చి చంపేశారు. అతని మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Pahalgam Attack: మంగళవారం కశ్మీర్‌లోని బైసారన్‌లో జరిగిన ఉగ్రదాడి ఒడిశా బాలాసోర్‌కు చెందిన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 9 ఏళ్ల కొడుకు, భార్య ముందే 41 ఏళ్ల ప్రశాంత్ సత్పతిని దారుణంగా కాల్చి చంపారు. అతని మరణ వార్త వినగానే తల్లి షాక్‌తో సృహతప్పి పడిపోగా గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక తాము రోప్‌వే నుంచి దిగుతుండగా ఉగ్రవాదులు ఆయన తలపై కాల్చి చంపారని ప్రశాత్ భార్య ప్రియదర్శిని ఆచార్య తెలిపింది. ప్రశాంత్ అక్కడికక్కడే పడిపోయాగా ఈ సంఘటన జరిగిన ఒక గంట తర్వాత సైన్యం వచ్చిందని చెప్పింది. ప్రశాంత్ మరణ వార్త గ్రామ తూర్పు ప్రాంతానికి చేరుకోగానే అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయని, ఈ షాక్ కారణంగా అతని తల్లి ఏమీ మాట్లాడలేకపోతున్నట్లు కన్నీరు పెట్టుకున్నారు.
నెలల తరబడి డబ్బు దాచుకుని..
ప్రశాంత్ బాలాసోర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET)లో అకౌంట్స్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. అయితే ఈ కశ్మీర్ పర్యటన కోసం అతను నెలల తరబడి డబ్బు దాచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెలవులు పెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి తమను తీసుకొచ్చాడని ప్రియదర్శిని తెలిపింది. బుధవారం రాత్రి మృతదేహాన్ని భువనేశ్వర్‌కు తీసుకురానుండగా.. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సూచనల మేరకు ఢిల్లీలో ఉన్న ఒడిశా రెసిడెంట్ కమిషనర్ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. గురువారం అంత్యక్రియలు జరుగనున్నాయి. దీనిలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొంటారని, బాధిత కుటుంబాన్ని ఓదారుస్తున్నట్లు భువనేశ్వర్ ఎంపీపీ అపరాజిత సారంగి తెలిపారు. కాంగ్రెస్, హిందూ జాగరణ్ మంచ్ ఈ దాడిని ఖండించి నివాళులర్పించాయి.
మరోవైపు ఉగ్రవాదుల దాడిని అడ్డుకునేందుకు హీరోలా ముందుకొచ్చి మరణించిన హార్స్‌రైడర్ సయీద్ అదిల్ హుస్సేన్ షాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పర్యటకులపై దాడికి పాల్పడుతుంటే అడ్డుకున్నాడు. ఉగ్రమూకల నుంచి తుపాకులు లాగేసుకునేందుకు ప్రయత్నించి, చివరికి వీరుడిలా ప్రాణాలు విడిచాడు. ఇక హుస్సేన్ మృతిపై స్పందించిన పేరెంట్స్.. ‘పనికోసం మా కొడుకు పహల్గాం వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు దాడి జరిగినట్లు తెలిసింది. మేము వెంటనే ఫోన్ చేశాం కానీ కలవలేదు. స్విచ్ఛాఫ్ వచ్చింది. సాయంత్రం 4.40 గంటల సమయంలో ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేయగా ఉగ్రదాడిలో మా బిడ్డకు గాయలైనట్లు చెప్పారు’ అని హుస్సేన్ తండ్రి సయ్యద్ హైదర్ షా చెప్పారు. కానీ చివరకు హుస్సేన్ మరణవార్త తెలిసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.