Credit Card : క్రెడిట్ కార్డుతో ఈ 5 రకాల ప్రయోజనాలు.. డబ్బు కూడా ఆదా! ఎలాగంటే? ప్రస్తుతం డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువైంది. దీనికి కారణం క్రెడిట్ కార్డులతో మాత్రమే లభించే అనేక ప్రయోజనాలు. దీని ద్వారా మీరు చాలా డబ్బును సులభంగా ఆదా చేసుకోవచ్చు. By Bhavana 21 Feb 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Credit Card Benefits : ప్రస్తుతం డెబిట్ కార్డు(Debit Card) ల కంటే క్రెడిట్ కార్డు(Credit Card) ల వినియోగం ఎక్కువైంది. దీనికి కారణం క్రెడిట్ కార్డులతో మాత్రమే లభించే అనేక ప్రయోజనాలు. దీని ద్వారా మీరు చాలా డబ్బును సులభంగా ఆదా చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్ రివార్డ్‌లు క్రెడిట్ కార్డ్‌లలో అతి ముఖ్యమైన ప్రయోజనాల్లో క్యాష్ బ్యాక్ రివార్డ్(Cashback Reward) ఒకటి. దీని వల్ల కార్డును ఉపయోగించి చేసే కొనుగోళ్ల పై సులభంగా క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కిరాణా, ఇంధనం, యూటిలిటీ బిల్లులు, షాపింగ్ పై స్థిర క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. డిస్కౌంట్లు, ఆఫర్లు: క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో మరో ముక్యమైనది ఏంటంటే డిస్కౌంట్లు, ఆఫర్లు. కంపెనీల నుంచి ప్రత్యేక తగ్గింపులు, ఆఫర్ ల ప్రయోజనం కూడా లభిస్తుంది. ప్రత్యేక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్(Co-Branded Credit Card) లను చాలా కంపెనీలు అందిస్తున్నాయి. వీటిపై ప్రత్యేక రాయితీల ప్రయోజనాన్ని క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు పొందుతారు. క్రెడిట్ స్కోర్ క్రెడిట్ స్కోర్(Credit Score) ను పెంచుకోవడానికి క్రెడిట్ కార్డ్ మంచి సాధనం. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ ను సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. వడ్డీ లేని రుణం వడ్డీ లేని రుణాలను ఇచ్చే ఏకైక ఆర్థిక సాధనం క్రెడిట్ కార్డు. చాలా క్రెడిట్ కార్డులకు 50 రోజుల వడ్డీ రహిత వ్యవధి ఉంటుంది. దీని వల్ల చాలా సులభంగా బిల్లును చెల్లించవచ్చు. అత్యవసర నిధి చాలా మంది ఆర్థిక నిపుణులు క్రెడిట్ కార్డ్ ను ఎమర్జెన్సీ ఫండ్(Emergency Fund) గా చూడకూడదని చెబుతున్నప్పటికీ ఏదైనా ఆర్థిక అవసరం ఉన్నట్లయితే క్రెడిట్ అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డు వల్ల అత్యంత సులభంగా నిధులను పొందవచ్చు. అయితే, క్రెడిట్ కార్డ్ ఫండ్‌లను ఉపయోగించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా సకాలంలో తిరిగి చెల్లించాలి. Also Read : దాదాసాహెబ్ ఫాల్కే ఉత్తమ నటుడి గా షారుక్ ఖాన్! #debit-cards #money-saving #credit-card-benefits #emergency-fund మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి