CPI Narayana: మోడీ ఉగ్రవాది. . బీజేపీకి ఓటు వేసే వారు ద్రోహులే: సీపీఐ నారాయణ

తెలుగు ప్రజానీకానికి ప్రధాని మోడీ ఉగ్రవాదని అన్నారు సీపీఐ నారాయణ. బీజేపీకి ఓటు వేసే తెలుగు వారు ద్రోహులే అని అన్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయిందని అన్నారు. స్వార్థం కోసం ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాయని విమర్శించారు.

New Update
CPI Narayana: జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

CPI Narayana: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఢిల్లీ కషాయము అయిందని అన్నారు. ఢిల్లీలో రైతులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ దుబాయిలో దేవాలయాన్ని ప్రారంభించారని.. ఇంట్లో ఈగలమోత బయట పల్లకీలో మోత అంటూ ఎద్దేవా చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ.. ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఏమైయ్యాయని ప్రశ్నించారు.

నేను బలవంతుడిని అవినీతిలేని వాడిని అని మోడీ చెబుతున్నాడని.. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఏమైందని నిలదీశారు. బీజేపీకి రాముడు ఒక ఈవెంట్ గా మారాడని ఫైర్ అయ్యారు. నిజంగా పనిచేస్తే దేవునిపై ఎందుకు ఆధారపడటం అని చురకలు అంటించారు. బీజేపీ దేవుడి పేరుతో సెంటిమెంటు రగల్చడం సరికాదని హితవు పలికారు.

ALSO READ: లోకేష్ ఎందుకు గెలవలేదు.. చంద్రబాబుకు ఎమ్మెల్యే బలరాం కౌంటర్

బీజేపీ హోల్ సేల్ అవినీతి..

బీజేపీ ఇన్వెస్టిగేషన్ సంస్థల ద్వారా ప్రతి ఒక్కరిపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలుగా బెయిలుపై ఉన్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. బీజేపీకి నితీష్ కుమార్ కోవర్టుగా మారారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ చిలక్కొట్టుడు అవినీతి, బీజేపీ హోల్ సేల్ అవినీతి అంటూ విమర్శలు గుప్పించారు.

రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం..

ఎన్నికల కమిషనర్ బీజేపీ వ్యక్తి అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాజ్యాంగాన్ని అందరూ కాపాడుకోవాలని హితవు పలికారు.ఇండియా కూటమిని అందరూ సపోర్ట్ చేయాలని అన్నారు. ఆంధ్రాకి శత్రువు బీజేపీ ప్రభుత్వమే... విభజన హామీలు ప్రత్యేక హోదా అమలు చేయలేదని పేర్కొన్నారు.

మోడీ ఉగ్రవాది..

తెలుగు ప్రజానీకానికి ప్రధాని మోడీ ఉగ్రవాదని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేసే వారు ద్రోహులే అని అన్నారు. కోడి కత్తి నాటకీయ పరిణామం‌ అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయిందని అన్నారు. స్వార్థం కోసం ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాయని విమర్శించారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ వలన ప్రజాస్వామ్య వ్యవస్థను మోడీ మోసం చేస్తున్నాడని అన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ పై చీఫ్ జస్టిస్ తీసుకున్న నిర్ణయం శుభ పరిణామం అని హర్షం వ్యక్తం చేశారు.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు