సజ్జనార్ గారు .. యువకులపై కాదు.. నాగార్జున పై చూపండి మీ ప్రతాపం!

ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో ముందు జరిగిన గొడవ గురించి తాజాగా సీపీఐ నారాయణ స్పందించారు. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి దమ్ముంటే బిగ్‌ బాస్‌ షో మీద, నాగార్జున మీద కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

New Update
సజ్జనార్ గారు .. యువకులపై కాదు.. నాగార్జున పై చూపండి మీ ప్రతాపం!

బిగ్‌బాస్‌ షో కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ షో విజయవంతంగా 7 సీజన్లు పూర్తి చేసుకుంది. గత రాత్రి 7 వ సీజన్‌ ఫైనల్ ఎపిసోడ్‌ జరిగింది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ తిరిగి వెళ్తుండగా.. రన్నరప్ అమర్ దీప్ కారు తో పాటు పలువురు ఎక్స్ కంటెస్టెంట్స్ కారు అద్దాలను పగలగొట్టి దాడి చేశారు. ఘర్షణలో అటు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ద్వంసం చేశారు.

దీని గురించి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అయిన అశ్విని, గీతూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీని పై స్పందించిన టీఎస్‌ ఆర్టీసీ తాజాగా ఈ ఘటన సంబంధించి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు. బస్సుల ధ్వంశం పై ఆర్టీసీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. “ప్రజలను వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చే బస్సుల పై దాడి చేస్తే.. సమాజం పై దాడి చేసినట్టే అంటూ సీరియస్ అయ్యారు”. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం సహించదని ట్వీట్ చేశారు.

ఇక్కడితో అయిపోయింది అనుకుంటే..తాజాగా ఈ విషయం గురించి సీపీఐ నారాయణ స్పందించారు. ముందు నుంచి కూడా సీపీఐ నారాయణ బిగ్ బాస్ కి వ్యతిరేకమే. ఆయన ఎన్నో సందర్భాల్లో ఈ షోను రద్దు చేయాలని, దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పైన కూడా చర్యలు తీసుకోవాలని చాలా సందర్భాల్లో చెప్పారు.

ఇప్పుడు సజ్జనార్‌ ట్వీట్‌ కి బదులుగా ఆయన ఒక వీడియోని విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. బిగ్‌ బాస్‌ షోనే పెద్ద ఆరాచకం. దానికి పర్మిషన్‌ ఇవ్వడమే కరెక్ట్ కాదు. ఈ విషయం గురించి మూడు సంవత్సరాల క్రితమే నేను సజ్జనార్‌ వద్దకు కంప్లైయిట్‌ ఇవ్వడానికి వెళ్తే మూడు రోజుల తరువాత కోర్టుకి వెళ్లమన్నారు.

అక్కడి నుంచి కింది కోర్టుకు..ఆ తరువాత జిల్లా కోర్టుకి అంటూ తిప్పారే తప్ప ఎటువంటి యాక్షన్‌ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయని కేసులు పెడతామంటున్నారు. అసలు ఈ బిగ్‌ బాస్‌ షో అనేది పెద్ద అసాంఘిక కార్యక్రమం. దీనిని వెంటనే బ్యాన్ చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం.

కేవలం డబ్బులు కోసం కక్కుర్తి పడి నాగార్జున లాంటి వ్యక్తి దానికి హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకాన్ని అట్రాక్ట్‌ చేయడానికి ఓ రైతుని తీసుకుని వచ్చి ఈసారి పెట్టారు. అది కాస్తా వైలెంట్‌ గా మారి అభిమానులు తన్నుకున్నారు.

అంతే తప్ప అక్కడ జరిగింది ఏమి లేదు. అసలు మీకు వీలుంటే ఇప్పటికైనా బిగ్‌ బాస్ షోని బ్యాన్‌ చేయాలని సజ్జనార్‌ ని కోరారు.

Also read: జీవితంలో మళ్లీ దాని జోలికి పోనంటున్న సలార్ భామ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment