ఆస్పత్రిలో కనీస అవసరాలే లేవు.. సీఎం మాత్రం గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడు: జగదీష్ విమర్శలు ఏపీ సీఎం జగన్ మొహన్ రెడ్డి పనితీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస అవసరాలు లేకపోయినా సీఎం మాత్రం వైద్య సేవలపై గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. By srinivas 26 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి పనితీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస అవసరాలు లేకపోయినా సీఎం మాత్రం వైద్య సేవలపై గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. గుంతకల్ ఏరియా ఆసుపత్రి వైద్య చికిత్సలను సిపిఐ బృందం పరిశీలించగా.. అత్యవసర సమయంలో రోగులకు మానవత్వంతో సేవలందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం ప్రసవం కోసం వచ్చిన మహిళను అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి రెఫర్ చేశారన్నారు. అయితే మార్గమధ్యంలో అంబులెన్స్ లోనే మహిళ ప్రసవించిందని, ఇది అత్యంత బాధకర విషయమన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించి మహిళకు ఆ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యుల కొరత, సిబ్బంది లేమి కారణంగా రోగులు పూర్తి ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి : TS New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు ఆ రోజు నుంచే.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన! అలాగే రోగుల రక్త పరీక్షల కోసం బయటికి రాసిస్తున్నారన్నారని మండిపడ్డారు. ఇక కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు క్లినిక్ లు పెట్టుకుని అక్కడ వైద్య చికిత్సలు అందజేస్తురన్నారని, తమ విధులు సరిగా నిర్వర్తించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు గుండె, ఎముకల వైద్య నిపుణులు లేని కారణంగా ఇక్కడి రోగులను అనంతపురంకి పంపిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం వైద్య సేవలపై గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. కనీసం రక్త పరీక్షలు, అవసరమైన ఔషధాలు ఆసుపత్రిలో అందుబాటులో లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కనీస అవసరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ఆర్డిటి, సత్య సాయి హాస్పిటల్ లో స్వచ్ఛందంగా అంకితభావంతో వైద్య సేవలు అందజేయడం వల్ల అనేక మంది రోగులు ఆరోగ్యవంతులు అవుతుని, అదే తరహాలోనే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అంకితభావం వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. #ap #cm-jagan #jagdish మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి