Spice Jet: ఉద్యోగులకు షాకిచ్చిన స్పైస్‌ జెట్‌ విమాన సంస్థ...1400 మంది తొలగింపు!

దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్‌ స్పైస్‌ జెట్‌ తాజాగా ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న 1400 మందిని తీసివేస్తున్నట్లు తెలిపింది.గత కొంత కాలం నుంచి ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

New Update
SpiceJet : హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్..పూర్తి వివరాలివే.!

Spice Jet: ప్రపంచాన్ని కరోనా (Covid) మహమ్మారి పట్టి పీడించిన తరువాత దాని ప్రభావం దాదాపు అన్ని వ్యాపార సంస్థల మీద కనిపించింది. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి తమ కంపెనీల నుంచి ఉద్యోగులను తొలగిస్తునే ఉన్నాయి. ఆ లే ఆఫ్‌ లు ఇప్పటికీ ఆగలేదు. ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగు పడుతున్నాయి అనుకుంటున్నప్పటికీ... ఇంకా లే ఆఫ్‌ లు కొనసాగుతునే ఉన్నాయి.

ఈ క్రమంలోనే దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్‌ స్పైస్‌ జెట్‌ తాజాగా ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న 1400 మందిని తీసివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఐటీ , బ్యాంకు రంగాలు మాత్రమే ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి అనుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి విమానయాన సంస్థలకు కూడా పాకింది.

స్పైస్‌ జెట్‌ లే ఆఫ్స్‌ ప్రకటించడంతో విమానయాన పరిస్థితులు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం స్పైస్‌ జెట్‌ ఎయిర్‌ లైన్స్‌ లో సుమారు 9 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 30 విమానాలు నడుస్తున్నాయి. గత కొంత కాలం నుంచి ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే వ్యయాన్ని తగ్గించుకునేందుకు స్పైస్‌ జెట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేవలం సంస్థలో ఖర్చులను నియంత్రణలో ఉంచుకునేందుకు ఉద్యోగాల కోతలు చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి ఇప్పటికే ఫోన్‌ ద్వారా సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.

అంతేకాకుండా చాలా కాలం నుంచి సంస్థలోని కొంతమందికి జీతాలు చెల్లించే విషయంలో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. ఆర్థిక పరిస్థితులు మందగించడంతో చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని స్పైస్‌ జెట్‌ సంస్థ తెలిపింది.

Also read: మంత్ర విద్యల ద్వారా చికిత్స చేయడాన్ని నిషేధించే బిల్లుకు ఆమోదం!

Advertisment
Advertisment
తాజా కథనాలు