Covid Vaccine: కొవిడ్ టీకాతో రక్తం గడ్డ కడుతుంది.. బాంబు పేల్చిన సైంటిస్టులు! కొవిడ్ వ్యాక్సిన్ వల్ల కలిగే లాభాల కంటే జరిగే నష్టాలే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయానాలు వెల్లడించాయి. టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, కండరల వాపు, రక్తం గడ్డ కట్టడం వాంటి చెడు ప్రభావాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 24 Feb 2024 in ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Covid : కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే. కొన్ని కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఆ తరువాత కొంతకాలానికి నిపుణులు కొవిడ్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టి మూడు దఫాలుగా వాటిని వేశారు. దాంతో కరోనా భూతానికి అడ్డుకట్ట పడింది. అయితే తాజాగా ఈ టీకాల వల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువగా జరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలను ఓ జర్నల్ ఇటీవల ప్రచురించింది. డబ్ల్యూహెచ్ వో (WHO) పరిశోధనా విభాగం, గ్లోబల్ వ్యాక్సిన్ డేటా పరిశోధకులు కొవిడ్ -19 వ్యాక్సిన్ వల్ల కలిగే 13 సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ఇందుకు గానూ సుమారు 99 మిలియన్ల మంది పై సర్వే నిర్వహించింది. ఎంఆర్ఎన్‌ఏ టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, కండరల వాపు, రక్తం గడ్డ కట్టడం వాంటి చెడు ప్రభావాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మూడు డోసులు తీసుకున్న వారిలో ఎక్కువగా మయోకార్డిటిస్ కేసులను గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. టీకాను రెండు డోసులు తీసుకున్న తరువాత ఇది 6.1 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మూడోడోసు తీసుకున్న తరువాత గుండెకు సంబంధించిన కేసులు 6.9 రెట్లు పెరిగినట్లు ఆరోగ్య నిపుణులు గుర్తించారు. మొదటి, నాలుగో డోసులు తీసుకున్న వారిలో సుమారు 1.7 రెట్లు, 2.6 రెట్లు ఈ ప్రమాదం తీవ్రత ఉన్నట్లు అధ్యయానాలు వెల్లడించాయి. అలాగే మూడో డోసు తీసుకున్న వారిలో ఎక్కువగా రక్తం గడ్డకట్టే ప్రమాదం 4 రెట్లు పెరిగినట్లు గుర్తించారు. నాలుగో డోసు తరువాత న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సెఫలోమైలిటిస్ వచ్చే ప్రమాదం 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు గుర్తించాయి. రెండో డోసు తీసుకున్న తరువాత ఈ ముప్పు 2.2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. మొత్తానికి కొవిడ్ వ్యాక్సిన్లు చేసే మేలు కంటే నష్టమే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. Also read: టాలీవుడ్ లో వాళ్లిద్దరికీ నేను వీరాభిమానిని..వారితో కలిసి నటించాలని ఉందంటున్న బాలీవుడ్ నటుడు! #covid-19 #health-problems #vaccines మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి