Counting update: ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు.. మిజోరాంలో నాలుగో తేదీన లెక్కింపు

ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఓట్ల లెక్కింపు తేదీని మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఆదివారమే అక్కడ లెక్కింపు నిర్వహించాల్సి ఉండగా, స్థానిక ప్రజల నుంచి భారీగా వచ్చినే వినతుల నేపథ్యంలో ఈసీ ఆ తేదీని మార్చింది.

New Update
Counting update: ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు.. మిజోరాంలో నాలుగో తేదీన లెక్కింపు

Election Commission: ఎన్నికల లెక్కింపునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్యరాష్ట్రం మిజోరాంలో ఓట్ల లెక్కింపు తేదీలో మార్పు చేసి ఒకరోజు వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో పాటు మిజోరంలో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించి మూడో తేదీన ఆదివారం ఫలితాలు ప్రకటించాలని ఈసీ మొదట నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం.. ఇండియా టుడే సంచలన రిపోర్ట్

అయితే, మిజోరాంలో ఓట్ల లెక్కింపు షెడ్యూులును ఆదివారం కాకుండా మరో రోజుకు వాయిదా వేయాలని స్థానిక ప్రజల నుంచి భారీ సంఖ్యలో వినతులు వచ్చాయి. వారి వినతులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు తేదీని నాలుగో తేదీ సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మార్పు కేవలం మిజోరాం రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు యథావిధిగా జరుగుతుందని, వాటిలో ఎలాంటి మార్పు లేదని ఈసీ స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 9న ఒకే విడతలో పోలింగ్‌ జరిగింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు