Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' పై కాపీ మరక.. ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన కొరియన్ ఆర్ట్ డిజైనర్! ప్రభాస్ 'కల్కి' మూవీ రెండు వారాల్లో రిలీజ్ కాబోతుంది. ఇలాంటి తరుణంలో సినిమాలో తన ఆర్ట్‌ను కాపీ కొట్టారంటూ కొరియాకు చెందిన సంగ్ చై సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్‌పై విమర్శలు గుప్పిస్తున్నాడు. అందుకు సంబంధించి ప్రూఫ్స్ సైతం బయటపెట్టాడు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి. By Anil Kumar 14 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Prabhas Kalki 2898 AD Movie : ప్రభాస్ (Prabhas) యాక్ట్ చేసిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి2898AD' (Kalki 2898AD) మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా కల్కి సినిమాలో తన ఆర్ట్‌ను కాపీ కొట్టారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా (Social Media) వేదికగా చిత్రయూనిట్‌పై విమర్శలు గుప్పిస్తున్నాడు. సౌత్ కొరియాకు చెందిన సంగ్ చై.. కాన్సెప్ట్ డిజైనర్‌గా హాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలకు పని చేశాడు. ప్రూఫ్స్ తో సహా... తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కల్కి యూనిట్ తన ఆర్ట్‌ను కాపీ కొట్టిందని పేర్కొంటూ అందుకు తగ్గ సాక్ష్యాన్ని సైతం పొందుపరిచాడు. పదేళ్ల క్రితం తను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన విజువల్ ఫోటోను.. కల్కి ట్రైలర్ ప్రారంభంలోని ఓ విజువల్ స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేశాడు. ఒకరు కష్టపడి తయారు చేసిన ఆర్ట్‌ను దొంగిలించడం అనైతికం అని క్యాప్షన్ జోడించాడు. తర్వాత కాసేపటికి ఆ క్యాప్షన్ తొలగించి కల్కి సినిమా, వైజయంతి మూవీస్ అన్న హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు. Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ముందే వచ్చేస్తున్న’దేవర’, పోస్టర్ తో అనౌన్స్ చేసిన టీమ్! దీంతో అతను పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తన ఆర్ట్ ను కాపీ కొట్టిన విషయాన్ని ప్రూఫ్స్ తో సహా బయటపెట్టడంతో ఇది చూసిన నెటిజన్స్ కల్కి టీమ్ పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'కాపీ కొడితే కొట్టారు కానీ ఒరిజినల్ క్రెడిట్స్ అయినా అతనికి ఇచ్చి ఉంటే బాగుండేదని' మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై కల్కి మూవీ టీమ్ రియాక్ట్ అవుతుందేమో చూడాలి. View this post on Instagram A post shared by Sung Choi (@sungchoiart) #prabhas #kalki-2898-ad #nag-ashwin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి