Bholashankar Movie: ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్.. ఈసారి నెట్ ఫ్లిక్స్‌తో తకరారు భోళాశంకర్ సినిమా విడుదలకు ముందు నెలకొన్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్, నిర్మాత అనీల్ సుంకరపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన కోర్టు.. సతీష్ వేసిన 4 పిటిషన్లను కొట్టేసింది. అయితే మరో పిటిషన్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అదే భోళాశంకర్ స్ట్రీమింగ్ రైట్స్. By Vijaya Nimma 12 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి Bholashankar Movie: ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్స్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమ్మేశారు. నెట్ ఫ్లిక్స్ నుంచి నిర్మాత కొంతమొత్తం అడ్వాన్స్ రూపంలో అందుకున్నాడు కూడా. ఇప్పుడు మిగతా మొత్తం కావాలంటే, కోర్టు కేసు క్లియర్ అవ్వాల్సి ఉంది. కేసును క్లియర్ చేయాలంటే, డిస్ట్రిబ్యూటర్ సతీష్‌కు సెటిల్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో భోళాశంకర్ డిజిటల్ రైట్స్‌కు ఈ కేసుకు లింక్ పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏజెంట్ సినిమా టైమ్‌లో తన నుంచి అనీల్ సుంకర 30 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెబుతున్నారు డిస్ట్రిబ్యూటర్ సతీష్. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇస్తానని హామీ ఇచ్చారట. కానీ సతీష్‌కు మాత్రం కేవలం వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ వరకు మాత్రమే ఇచ్చారంట. ఆ తర్వాత ఇదే అంశంపై అనీల్ సుంకరను కలిశారంట సతీష్. దీంతో వాళ్లు సతీష్‌కు అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత సామజవరగమన చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చినప్పటికీ ఆ సినిమా నుంచి చాలా తక్కువ లాభాలు వచ్చాయని, రికవరీ అవ్వలేదని చెబుతున్నారు సతీష్. ఈ నేపథ్యంలో.. 45 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని అనీల్ సుంకర హామీ ఇచ్చారట. ఈసారి భోళాశంకర్ సినిమాకు లింక్ పెట్టారు. దీంతో చేసేదేం లేక, తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కారు సతీష్. ఆ వ్యవహారం అటుఇటు తిరిగి భోళాశంకర్ డిజిటల్ రైట్స్ దగ్గరకు వచ్చి ఆగింది. మరికొన్ని రోజుల్లో ఈ కేసు కొలిక్కి వచ్చేలా ఉంది. #hyderabad-city-civil-court #controversies #bholashankar-movie #against-distributor #satish-and-anil-sunkara మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి