కానిస్టేబుల్ నిర్వాకం..లాడ్జిలో అడ్డంగా దొరికిపోయాడు..!! గుంటూరు లాడ్జిలో యువతితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కానిస్టేబుల్ శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం అయినప్పట్టికి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. తాజాగా, ఓ లాడ్జిలో సదరు యువతితో శ్రీనివాసరావు ఉండగా భార్య ,బంధువులకు అడ్డంగా దొరికిపోయాడు. By Jyoshna Sappogula 19 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Illegal Affair: గుంటూరులో కానిస్టేబుల్ శ్రీనివాసరావు నిర్వాకం గుట్టు రట్టు అయింది. పెళ్లి అయినప్పట్టికి మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కానిస్టేబుల్ శ్రీనివాసరావు. ఈ విషయంపై భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. తాజాగా గుంటూరులో ఓ లాడ్జిలో సదరు యువతితో శ్రీనివాసరావు ఉండగా ఆయన భార్య, బంధువులకు అడ్డంగా దొరికిపోయాడు. బాధ్యతమైన పోలీస్ పదవిలో ఉంటు తానే తప్పుడు మార్గంలోకి వెళ్లాడు కానిస్టేబుల్ శ్రీనివాసరావు. ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరులో శ్రీనివాసరావు అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది.అయితే, ఇదే సమయంలో మరో యువతితో కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. భర్తపై అనుమానం వచ్చిన భార్య అసలు విషయం తెలుసుకుంది. భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గ్రహించింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.అయితే, ఎంత చెప్పిన భర్త మారకపోవడంతో భార్యకు విసుగుపుట్టింది. ఎలాగైన భర్తకు బుద్ది చెప్పాలని అనుకుంది. Also Read: పవన్ రాజకీయాలకు అన్ ఫిట్ : మంత్రి అంబటి గుంటూరులో ఓ లాడ్జిలో సదరు యువతితో భర్త శ్రీనివాసరావు ఉన్నాడని భార్య తెలుసుకుంది. వెంటనే ఆమె బంధవులకు సమాచారం అందించింది. కానిస్టేబుల్ భార్య, బంధువులు ఆ లాడ్జి దగ్గరకు చేరుకున్నారు. కానిస్టేబుల్ నిర్వకంపై పోలీసులకు సైతం సమాచారం అందించింది. అక్కడి వెళ్లి చూడడంతో కానిస్టేబుల్ శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో, లాడ్జికి చేరుకున్న పోలీసులు ఆయనను, యువతిని అక్కడికక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. #guntur #ap-police #ap-constable మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి