Attack on Harish Rao Office : సిద్ధిపేటలోఅర్ధరాత్రి హైడ్రామా.. హరీష్‌రావు ఆఫీస్‌పై దాడి!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి క్యాంప్‌ గేట్లు బద్ధలు కొట్టి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. హరీష్‌రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

New Update
Attack on Harish Rao Office : సిద్ధిపేటలోఅర్ధరాత్రి హైడ్రామా.. హరీష్‌రావు ఆఫీస్‌పై దాడి!

Siddipet : సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు హల్ చల్ చేశారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) క్యాంపు ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. క్యాంప్‌ గేట్లు బద్ధలు కొట్టి ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. ఆఫీస్‌ పైకెక్కి హడావిడి చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. జై కాంగ్రెస్‌, జైజై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ మాటతప్పకుండా రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రావడంతో హరీష్‌ ఆఫీస్‌ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను బయటకు పంపించేశారు. ఆఫీస్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read : రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..అత్యవసరం అయితేనే బయటకు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anemia: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి

రక్తహీనత, హిమోగ్లోబిన్ లేక పిల్లలు, మహిళలు బాధపడుతూ ఉంటారురు.మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Anemia

Anemia

Anemia: భారతదేశంలో రక్తహీనత ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. చాలా మంది రక్తహీనత, హిమోగ్లోబిన్ లేకపోవడంతో బాధపడుతున్నారు. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత ముఖ్యంగా పిల్లలు, మహిళలు, బలహీనులను ప్రభావితం చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం 6 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల 67శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దాదాపు 52శాతం గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ ఆహారాలు ముట్టుకోకూడదు

సరైన ఆహారం తీసుకోకపోవడం..

ప్రసవ సమయంలో సమస్యలను కలిగిస్తుందని, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శాకాహారులు తరచుగా సలాడ్ లేదా పండ్లను మాత్రమే తినడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు. రక్త కణాలలు తగ్గడానికి శరీరంలో ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీర్ణవ్యవస్థలో సమస్యలు, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం, ఏదైనా రకమైన గాయం, అధిక ఋతు రక్తస్రావం కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు.

Also Read:  బ్రో..'లక్కీ భాస్కర్' ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మొలకలు నాన్-హీమ్ ఐరన్ మంచి మూలం. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read  రోజూ గుడ్డు తింటే వృద్ధాప్యంలోనూ మతిమరుపు ఉండదు

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment