V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావు అస్వస్థత గురయ్యారు. ఆయన్ను అంబర్‌పేటలో ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 29 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావు అస్వస్థత గురయ్యారు. ఆయన్ను అంబర్‌పేటలో ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నెలలో వీహెచ్ అస్వస్థకు గురి కావడం ఇది రెండో సారి. ఫిబ్రవరి 21న అనారోగ్యం కారణంగా వీహెచ్ ఆసుపత్రిలో చేరగా.. ఇటీవల డిశ్చార్ అయ్యి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ కార్యకర్తలలో ఆందోళన నెలకొంది. ఆయన తొందరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నారు. ALSO READ: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్ రాజ్యసభ రాలేదు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నా.. పార్టీ నమ్ముకుని.. పార్టీ బలోపేతం కోసం పని చేశారు మాజీ పీసీసీ చీఫ్, రాజ్య సభ సభ్యుడు వి. హనుమంతరావు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కోసం మంతనాలు జరిపారు.. కానీ టికెట్ రాలేదు. తరువాత ఎమ్మెల్సీ వస్తుందని ఆశించిన వీహెచ్ కు నిరాశే మిగిలింది. రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో తన గొంతు వినిపించాలని అనుకోని రాజ్యసభ టికెట్ ఆశించారు వీహెచ్.. కానీ ఈ విషయంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. రాజ్యసభ రెండు స్థానాలను సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు కేటాయించింది. ఎంపీ టికెట్ రేసులో.. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య భట్టి నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. తాజాగా ఈ రేసులోకి కొత్త వ్యక్తి వచ్చారు. అదెవరో కాదు మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు. ఖమ్మం పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కొరకు గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తుందనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. #congress #v-hanumantha-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి