Congress:భారత్‌ న్యాయ్ యాత్రకు ముందే అభ్యర్థుల ప్రకటన..సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం

అభ్యర్థుల ప్రకటన విషయంలో సీడబ్ల్యూసీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మిత్ర పక్షాల ఒత్తిడి చేస్తుండడంతో ఈ వ్యవహారాన్ని తొందరగా ముగించాలని డిసైడ్ అయింది. జనవరి 14 నుంచి మొదలయ్యే రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర కన్నా ముందే సీట్ల పంపకాన్ని ఫినిష్ చేయాలని భావిస్తోంది.

New Update
Congress:భారత్‌ న్యాయ్ యాత్రకు ముందే అభ్యర్థుల ప్రకటన..సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం

Seats Sharing:పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరిగింది. సీట్ల పంపకాలు, సర్దుబాట్ల విషయంలో పార్టీ నేతలు మిత్ర పక్షాలను అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీనియన్ నేత ముకుల్ వాస్ని పలు ప్రతిపక్ష అధినేతలకు ఫోన్ చేసి మాట్లాడారని చెబుతున్నారు. దీంతో పాటూ ప్రతిపక్షాల నుంచి కూడా కొంత మంది నేతలను కాంగ్రెస్‌లో జాయిన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం అంతా జనవరి 14లోపు అయిపోవాలని అనుకుంటోంది. ఆరోజు నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రతో బిజీ అయిపోతారు కాబట్టి ఈలోపునే తేల్చేయాలని భావిస్తోంది. ఇది మొత్తం ఒక కొలిక్కి వస్తే న్యాయ్ యాత్రతోనే కాంగ్రెస్ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాలని ప్లాన్‌లు వేస్తోంది. మొత్తానికి సార్లమెంటు ఎన్నికలకు పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది.

Also Read:ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా షర్మిల

దీనికి సంబంధించి నిన్న ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి ఏఐసీసీ ఛీఫ్ మల్లిఖార్జు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటూ ముకుల వాస్నిక్ ఇంకా సీట్ల పంపకాల కమిటీ హాజరయ్యారు. ఈ కమిటీలో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ సభ్యులుగా ఉన్నారు.

అయితే ఈ సీట్ల పంపకం వ్యవహారం అంత సాఫీగా సాగే సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఇండియా కూటమిలో విభేదాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఇప్పుడు ఈ సీట్ల పంపాకాల్లో అది మరోసారి బయటపడింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విషయంలో కాంగ్రెస్, టీఎంసీ రాజీకి రావడం లేదు. ఇరు పార్టీలు ఇండివిడ్యువల్‌గానే పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. బెంగాల్‌లో బీజేపీని ఒక్క టీఎంసీనే సమర్ధవంతంగా అడ్డుకోగలదని ఆ పార్టీ చెబుతోంది. అయితే మమత దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రాతిపాదించారని గుర్తు చేశారు. ఒంటరిగా పోటీ చేసి గతంలో కంటే అధిక స్థానాలు గెలిచే సత్తా మాకు ఉంది. దానికి మేం సిద్ధంగా కూడా ఉన్నామని అంటున్నారు.

ఇక మహారాష్ట్రలో శివసేన, నేనలిస్ట్ కాంగ్రెస్‌లు ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ తమకు రావాల్సిన సీట్ల మీద మాత్రం గట్టి పట్టుతోనే ఉన్నారు. శివసేన తాము పోటీ 23 స్థానాలు తమకు ఇవ్వాల్సిందే అంటుండగా..శరద్ పవార్ వర్గం మాత్రం తమకు 44 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టబడుతోంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా ఢిల్లీ, పంజాబ్‌లలోని 21 సీట్లలో దేనినైనా పంచుకోవడం తమకు ఇష్టం లేదని చెబుతున్నారు. ఇంకోవైపు ఎవరి రాష్ట్రాల గురించి వాళ్ళు స్ట్రాంగ్ ఒపినీయన్‌తో చర్చలు చేస్తున్నారు. అన్నింటికన్నా ఉత్తరప్రదేశ్‌లో పీట్ల పంపకం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇవి ఎవరెవరికి ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు