Congress Prajagarjana: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్

చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. ఎస్సీల చిరకాల డిమాండ్ ఏ,బి, సి,డి వర్గీకరణ అమలుకై కృషి చేస్తామని తెలిపారు. వేదికపై దివంగత ప్రజానాయకుడు గద్దర్ చిత్రపటానికి ఖర్గే, రేవంత్, భట్టి, తదితరులు నివాళులు అర్పించారు.

New Update
Congress Prajagarjana: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్

చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై దివంగత ప్రజానాయకుడు గద్దర్ చిత్రపటానికి ఖర్గే, రేవంత్, భట్టి, తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం ఖర్గే సమక్షంలో ఆర్మూర్ నేతలు గోర్త రాజేందర్, వినయ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు ప్రజాగర్జన సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గేకు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాదర స్వాగతం పలికారు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తూ రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..

► దళిత, గిరిజన వర్గాల కోసం అనేక సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.

► జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18% కి పెంపు

► ఎస్సీల చిరకాల డిమాండ్ ఏ,బి, సి,డి వర్గీకరణ అమలుకై కృషి చేస్తాం

► అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేత

► దళిత, గిరిజనుల విద్య, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకై ప్రత్యేక పథకాలు

► సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గూడెం, తండా, గ్రామ పంచాయితీకి రూ. 25 లక్షల నిధులు

► ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు

► ప్రైవేటు విద్యా సంస్థలలో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్ల కల్పన

► ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంలో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అందజేత

► బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో పునరుద్ధరణ..

► అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం

► 3 ఎస్సీ కార్పొరేషన్లు.. మాదిగ, మాల మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకు ఏర్పాటు.. ప్రతి ఏడాది రూ.750 కోట్ల నిధులు

► 3 ఎస్టీ కార్పొరేషన్లు, .. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్లు ఏర్పాటు.. ప్రతి ఏడాది రూ.500 కోట్ల నిధులు

► నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబా బాద్ లో 5 కొత్త ఐటీడీఏలు – ఐటీడీఏలలో 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

► విద్యా జ్యోతులు పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాసైతే రూ.10,000, ఇంటర్ పాసైతే రూ.15,000..

► గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ. లక్ష అందజేత, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ.5 లక్షలు అందజేత

► విదేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత

Advertisment
Advertisment
తాజా కథనాలు