Telangana: లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే..

నారాయణఖేడ్ టికెట్ విషయంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సురేష్‌ షెట్కార్‌కు బదులుగా పటోళ్ల సంజీవ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దాంతో సంజీవ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సురేష్ షెట్కార్‌కు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

New Update
Telangana: లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే..

Narayankhed Congress Candidate: తెలంగాణ ఎన్నికల(Telangana Elections) నేపథ్యంలో పార్టీల అభ్యర్థుల ఎంపికలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కాగా.. ఇవాళ కూడా బిగ్ ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ(Congress Party). తాజాగా ఓ నియోజకవర్గానికి అభ్యర్థిని మార్చేసింది. నారాయణ ఖేడ్‌(Narayankhed)లో సురేష్‌ షెట్కార్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు బదులుగా పటోళ్ల సంజీవ్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఇప్పటి వరకు నాలుగు స్థానాలకు అభ్యర్థులను మార్చింది కాంగ్రెస్. వనపర్తి, పటాన్‌చెరు, బోధ్, నారాయణఖేడ్‌ స్థానాల్లో ముందు ప్రకటించిన అభ్యర్థులకు బదులుగా.. కొత్త అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, నారాయణఖేడ్ విషయంలో సురేష్ షెట్కార్, సంజీవ్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. ఈ కారణంగా టీకెట్ మార్పునకు ఇద్దరు నేతలూ అంగీకరించారు. సంజీవ్ అభ్యర్థిత్వాన్ని సురేష్ అంగీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రతిగా సురేష్ షెట్కార్‌కు లోక్‌సభ టికెట్‌ను కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన.. సంజీవ్‌కు టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారని చెబుతున్నారు. ఏది ఏమైనా.. నామినేషన్‌కు మరికాసేపు సమయం మాత్రమే ఉండగా.. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి సీనియర్ జర్నలిస్ట్ జనవాడే సంగప్ప పోటీ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే వీరి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో.. ఇద్దరూ ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిగా సురేష్ షెట్కార్‌ని ముందుగానే ఖరారు చేసినప్పటికీ.. వర్గపోరు ఎక్కువైంది. సురేష్ షెట్కార్, సంజీవ్ రెడ్డి మధ్య టికెట్ పంచాయితీ తీవ్రమైంది. దాంతో ఇక లాభం లేదనుకున్న కాంగ్రెస్ అధిష్టాం రంగంలోకి దిగింది. ఇద్దరినీ కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చింది. టికెట్ మార్పు అంశంపై ఇద్దరితోనూ చర్చించారు పార్టీ పెద్దలు. ఇరువురి అంగీకారంతో షెట్కార్ స్థానాన్ని సంజీవ్‌ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్. సంజీవ రెడ్డి విజయం కోసం కలిసి పని చేస్తామని షెట్కర్ కూడా ప్రకటించారు.

Also Read:

అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

మరో ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు..

Advertisment
Advertisment
తాజా కథనాలు