గవర్నర్‌కు లేఖ అందించిన కాంగ్రెస్ నేతలు.. సోమవారం సీఎల్పీ సమావేశం..

తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు సీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్,ఉత్తమ్‌ తదితరులు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు లేఖ అందించారు. అయితే సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం ఉంటుందని తెలుస్తోంది.

New Update
గవర్నర్‌కు లేఖ అందించిన కాంగ్రెస్ నేతలు.. సోమవారం సీఎల్పీ సమావేశం..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల బృందం సభ్యులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసైని కలిసారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లేఖ అందించారు. సోమవారం రోజున శాసనసభపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే గవర్నర్‌ కలిసిన వారిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు ఉన్నాయి. అయితే సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారణానికి రెడీగా ఉండాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డీకే శివ కుమార్ మాట్లాడుతూ.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాకు 65 మంది ఎమ్మెల్యేలను ఉన్నారని.. సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం ఉంటుందని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు సీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్,ఉత్తమ్‌ తదితరులు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు లేఖ అందించారు. అయితే సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం ఉంటుందని తెలుస్తోంది.

Also Read: ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా.. భారీగా ఓట్లు, మెరుగైన సీట్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు