ఖాళీ బొకేతో ప్రియాంక గాంధీని ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు! కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి మధ్యప్రదేశ్ లో ఓ వింత అనుభవం ఎదురయ్యింది. ఆమెను వేదిక మీదకి కాంగ్రెస్ నాయకులు ఖాళీ బొకే తో స్వాగతం పలికారు. By Bhavana 07 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Priyanka Gandhi: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి మధ్యప్రదేశ్ సభలో ఓ అనుకొని సంఘటన ఎదురయ్యింది. ఆ ఘటన వల్ల అక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆమె ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. దీంతో వేదిక మీద నవ్వులు విరిశాయి.అసలేం జరిగిందంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్ లో ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదిక పైకి ఆమె రాగానే ఓ నాయకుడు ఆమెకు బొకే ఇచ్చి స్వాగతం పలికాడు. అయితే ఆ బొకేలో పువ్వులు లేవు (Empty Bouquet). దానిని చూసిన ప్రియాంక గాంధీ పువ్వులు ఏవీ అంటూ గట్టిగా నవ్వేశారు. తన పొరపాటును గ్రహించిన ఆ నాయకుడు నాలుక కరుచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఒప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. Also read: విశాఖ – తిరుపతి రైలులో పొగలు..టపాసుల కలకలం! ఈ నెలాఖరుకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) ఈసారి ఎలాగైన గెలుపును సొంతం చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగానే ఆమె మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇలా పువ్వులు లేని బొకే ఇవ్వడంతో అక్కడ నవ్వులు విరిసాయి. ఆ తరువాత సభలో ప్రసంగించిన ప్రియాంక తన ప్రసంగం మధ్యలో పుష్ప గుచ్చం గురించి ప్రస్తావించారు. తాను ఇంతకు ముందే ఓ బొకే అందుకున్నానని చెప్పారు.అది అచ్చంగా బీజేపీ (BJP) లీడర్లు ఇస్తున్న హామీల్లాగే… బొకే కూడా ఖాళీగా ఉందని చెప్పడంతో జనం విరగబడి నవ్వారు. ఇండోర్ సభలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేయడంతో అది తెగ వైరల్ గా మారింది. गुलदस्ता घोटाला 😜गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94— Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023 Also read: మహారాష్ట్రల్లో దూసుకెళ్తున్న కారు.. 57 సర్పంచ్ లు గులాబీ కే! #congress #priyanka-gandhi #national మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి