Big Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈ నెల 7న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీనియర్లకు న్యాయం జరుగుతుందని.. అంతా కలిసి టీమ్ గా పని చేస్తారన్నారు. By Nikhil 05 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఈ నెల 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (TS Assembly Elections Results) విడుదలైన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ ముఖ్యమంత్రి గా కొడంగల్ ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరును ప్రకటించింది. ఎల్లుండి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీనియర్లందరికీ న్యాయం చేస్తామన్నారు. సీఎల్పీ నేతను ఎన్నుకునే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ ను సీఎల్పీ నేతగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దీంతో సీఎంగా రేవంత్ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది కూడా చదవండి: ఈ నెల 3న వెల్లడించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లను సాధించింది. 39 సీట్లకే పరిమితమైన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఫలితాలు విడుదలైన మరుసటి రోజు సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి సీఎం ఎంపికపై జోరుగా చర్చలు నిర్వహించింది కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క పేరు సీఎం రేసులో వినిపించింది. తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఈ రోజు ప్రకటించారు. దీంతో రేవంత్ ను సీఎం కానిస్తారా? అన్న అనుమానాలు ఆయన వర్గంలో వక్తమైంది. కానీ ఊహానాగాలకు తెరదించుతూ.. రేవంత్ పేరునే కాంగ్రెస్ ఫైనల్ చేసింది. అయితే.. రేవంత్ తో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఎవరెవరికి ఏ శాఖ దక్కుతుంది? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. #revanth-reddy #telangana-election-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి