Health Tips: గర్భాశయంలో సమస్యలు ఉంటే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయి

గర్భాశయంలో లోపం ఉంటే అది గర్భధారణలో సమస్యలను కలుగుతాయి. టైమ్‌కి పీరియడ్స్‌ రాకపోవడం, నడుము, కాళ్లలో నొప్పి, మూత్రం లీకేజీ ఉంటాయి. గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అల్లం, వేప ఆకులను ఉడకబెట్టి హెర్బల్ టీ చేసుకుని తాగాలి. పసుపు పాలు, బాదం పాలు తాగితే బెటర్‌.

New Update
Health Tips: గర్భాశయంలో సమస్యలు ఉంటే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయి

గర్భాశయంలో ఏదైనా లోపం ఉంటే అది గర్భధారణలో సమస్యలను కలిగిస్తుంది. గర్భాశయంలో సమస్యలుంటే.. టైమ్‌కి పీరియడ్స్‌ రాకపోవడం, నడుము, కాళ్లలో నొప్పి, మూత్రం లీకేజీ వింటి ఉంటాయి. గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తాజా అల్లం, వేప ఆకులను ఉడకబెట్టి హెర్బల్ టీ చేసుకుని తాగాలి. పసుపు పాలు, బాదం పాలు గర్భాశయంలో వాపు, ఇతర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గర్భాశయం మహిళల శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది గర్భధారణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే గర్భాశయంలో ఏదైనా లోపం ఉంటే అది గర్భధారణలో సమస్యలను కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిన్న చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. గర్భాశయం దెబ్బతినడానికి సంబంధించిన కొన్ని లక్షణాలను తెలుసుకుందాం.

గర్భాశయంలో సమస్యలు ఉంటే:

గర్భాశయ సమస్యల ముఖ్యమైన లక్షణం పీరియడ్స్‌కు సంబంధించిన సమస్యలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పీరియడ్స్ 5-7 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే అది గర్భాశయానికి సంబంధించిన సమస్యలకు సంకేతం కావచ్చు. చాలా మంది అమ్మాయిలు, మహిళలు దీనిని సీరియస్‌గా తీసుకోరు. ఇలా చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

టైమ్‌కి పీరియడ్స్‌ రాకపోవడం:

రుతుక్రమం సకాలంలో రాకపోవడం లేదా రెండు పీరియడ్స్ మధ్య చాలా రోజుల గ్యాప్ ఉండడం కూడా గర్భాశయం లోపానికి సంకేతం. పీరియడ్స్ సక్రమంగా లేకుంటే డాక్టర్‌ని సంప్రదించి గర్భాశయానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.

నడుము, కాళ్లలో నొప్పి:

గర్భాశయంలో సమస్యలు ఉందనడానికి వెన్ను, నడుము నొప్పి కూడా ఒక కారణం కావొచ్చు. గర్భాశయంలో సమస్య వల్ల కాళ్లలో నొప్పి వస్తుంది, వెన్ను, నడుములో కూడా విపరీతంగా నొప్పి కలుగుతుంది.

మూత్రం లీకేజీ:

గర్భాశయంలో ఏదైనా ఆటంకం ఏర్పడిన తర్వాత మూత్రాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. అలాంటి పరిస్థితిలో వారికి తరచుగా మూత్రం లీకేజ్ సమస్య ఉంటుంది. గర్భాశయంలో సమస్య ఉంటే మూత్రాశయం మీద చాలా ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల మూత్రం కారుతుంది.

గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే:

తాజా అల్లం, వేప ఆకులను ఉడకబెట్టి హెర్బల్ టీ చేసుకుని తాగాలి.

పసుపు పాలు:

పాలలో కాస్త పసుపు పొడి కలుపుకుని తాగాలి. ఇది గర్భాశయంలో వాపు, ఇతర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బాదం, పాలు:

గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉంటే బాదం, పాలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఈ ఐదు అలవాట్లు మానవ సంబధాల్లో చిచ్చుపెడతాయి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు