LPG Gas Price Hike:మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. ప్రతీ నెల పెరిగినట్టే కమర్షియల్ గ్యాస్ ధరలు ఈ నెల కూడా పెరిగాయి. అయితే ఈ నెల ఏకంగా 101 పెరగడం గమనార్హం. ఇజ్రాయెల్-మమాస్ దాడుల నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరగడంతో...గ్యాస్ మీద కూడా పడినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 01 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి LPG Gas Price Hike: ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. అది కూడా వంద రూపాయలకు పైనే ధర అధికమయింది. అయితే కేవలం ఎల్పీజీ (LPG) అందించే కమర్షియల్ గ్యాస్ కు మాత్రమే వర్తిస్తుంది. రెండు నెలల్లో ఈ ధర పెరగడం ఇది రెండోసారి. లాస్ట్ మంత్ కరెక్ట్ గా ఇలాగే ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ ధర పెరిగింది. ఇప్పుడు మళ్ళీ వంద 101.50 రూ ధర అధికం అయింది. Also Read:సీజల్ వ్యాధుల బారి నుంచి కాపాడే టీలు ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య వార్ (Israel-Hamas War) ఆయిల్, పెట్రోల్ లాంటి వాటి మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. దీని వలన ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. దాంతో పాటూ గ్యాస్ ధర కూడా పెరుగుతోంది. కొత్తగా పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఎల్పీజీ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. గల నెల ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రేటు 1731.50 ఉండగా ఈ నెల 101.50 పెరిగి 1833రూ. కు చేరుకుంది. అయితే ఈ పెంపు కేవలం కమర్షియల్ గ్యాస్ కు మాత్రమే వర్తిస్తుంది. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఏ మార్పూ లేదు. ఇక గత నెల మొదట్లో కేంద్ర మంత్రి వర్గం ఉజ్వల పథకం (Ujjwala Scheme) కింద అదనంగా 75 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లను ఆమోదించింది, దీనిని వచ్చే మూడేళ్ళు ఇస్తామని తెలిపింది. ఈ కనెక్షన్ల మొత్తం వ్యయం 1,650 కోట్లు. ఉజ్వల పథకం కింద అందిస్తోన్న డిపాజిట్ రహిత కనెక్షన్ల కొనసాగింపుగా ఈ కొత్త కనెక్షన్లు ఉంటాయి సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తెలిపారు. Also Read:శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 50మంది పౌరులు.. హమాస్ కమాండర్ హతం! #lpg #lpg-gas-price-hike మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి