Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 6 గురు మృతి!

ముంబై దగ్గర్లోని జల్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే లో శుక్రవారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

New Update
Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 6 గురు మృతి!

Mumbai : ముంబై దగ్గర్లోని జల్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (Nagpur Express Way) లో శుక్రవారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో స్విఫ్ట్‌ డిజైర్‌ కారు పెట్రోల్‌ నింపుకుని రాంగ్‌ రూట్లో హైవేలోకి ప్రవేశించి నాగ్‌ పూర్‌ నుంచి ముంబై వెపు వెళ్తున్న ఎర్టిగా కారు ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు కార్లు ఒకదానినొకటి వేగంగా ఢీకొనడంతో ఎర్టిగా కారు ఎగిరి హైవే పై ఉన్న బారికేడ్‌ పై పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు కారులో నుంచి రోడ్డు పై పడిపోయారు. ఈ ప్రమాదంలో మరో కారు కూడా తీవ్రంగా దెబ్బతింది. రెండు కారుల్లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సమృద్ధి హైవే పోలీసులు, జాల్నా పోలీసులు (Jalna Police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్లను తొలగించేందుకు క్రేన్‌ను వినియోగించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Also read: మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ నుంచి రూ.2.5 లక్షలతో..

Advertisment
Advertisment
Advertisment