Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్లీ వాస్తు మార్పులు..! తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయంను ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్పు చేయనున్నారని.. తొమ్మిదో అంతస్తులో పనులు కొనసాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 03 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్లీ వాస్తు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాస్తు మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ ద్వారా సీఎం కాన్వాయి ఎంట్రీ ఇస్తుండగా.. ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లిపోయేలా మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. Also read: గెట్ రెడీ ఫర్ సెలబ్రేషన్స్.. వైసీపీ నేతలకు సజ్జల పిలుపు..! సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా IAS, IPS, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలకు అవకాశం కనిపిస్తోంది. రేవంత్ బాధ్యతలు చేపట్టాక సీఎం కార్యాలయం (CM Office) ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్చనున్నట్లు తెలుస్తుంది. సీఎంవో ఏర్పాటు కోసం తొమ్మిదో అంతస్తులో పనులు కొనసాగుతున్నాయని.. సెక్రటేరియట్‌లో మరికొన్ని విభాగాల్లోనూ మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. #cm-revanth #telangana-secretariat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి