CM Revanth: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..ఆగస్టు 15 నాటికి..!

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15నాటికి రైతులకు రూ. 2లక్షల మేర రుణమాఫీ చేస్తామని అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడారు. తెలంగాణలో 15ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తామన్నారు.

New Update
CM Revanth: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..ఆగస్టు 15 నాటికి..!

CM Revanth:లోకసభ ఎన్నికల్లో తెలగాణ లో 15ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 10శాతంగా ఉన్న ముదిరాజ్ లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు బీసీ డీ నుంచి బీసీఏ గ్రూపులోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నా..10ఏళ్లపాటు కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. మాదిగల వర్గీకరణ చేయాల్సిందేనని, వాళ్లకు న్యాయం జరిగాల్సిందే అన్నారు. భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

ఎన్నికష్టాలు ఎదురైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ జెండాను వదల్లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు, బీసీలకు టిచకెట్లు ఇచ్చి గెలిపించిందన్నారు. వెనకబడిన సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ కు మించిన పార్టీ లేదన్నారు. నారాయణపేట మున్సిపాలిటీకి భూగర్భడ్రైనేజీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 10 సంవత్సరాల నుండి మోడదీ అధికారంలో ఉన్నా ఏమైనా ఈ ప్రాంత అభివృద్ధి కి కలిసారా అని అడిగారు. ఇక్కడ ప్రజలు వలసలు పోతుంటే పట్టించు కోలేదు..మోదీకి ఓటు ఏలా వేస్తారని ప్రశ్నించారు. ఆడబిడ్డల కు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించినందుకు రేవంత్ ను ఓడించాలా?ఆనాడు 400 కు సిలిండర్ ఇస్తే మోదీ ఆ సిలిండర్ 1200 చేసాడు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటిలను అమలు చేసాం, అందుకు బిఆర్ఎస్,బీజేపీ లు కాంగ్రెస్ ను,రేవంత్ ఓడగొట్టండి అంటున్నారు.

కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్నాడు కానీ ఒక్కరికి ఇవ్వలేదు.కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తామన్నాడు కానీ మేము వచ్చిన వంద రోజుల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చాం.10 సంవత్సరాల లో విధ్వంసం సృష్టిస్తే దానిని చక్కదిద్ది ముందుకు వెళ్తున్నాం. పేదల బిడ్డ ముఖ్యమంత్రి అయితే వీరికి ఎందుకింత కడుపునొప్పి. కుట్రలు కుతంత్రాలు తో బీజేపీ వారు బిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం కుదిరింది.సిట్టింగ్ ఎంపీ కోసం గత ఎమ్మెల్యే లు ఒక్కరు కూడా ఓట్లు అడగటం లేదు బిడ్డ బెయిల్ కోసం రాష్ట్రంలో ఐదు సీట్ల లో కేసీఆర్ సూపరి తీసుకుని మోదీ దగ్గర బిఆర్ఎస్ కేసీఆర్ తాకట్టు పెట్టాడు.బిఆర్ఎస్ కార్యకర్తలు ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని మోదీకి తాకట్టు పెట్టాడు.చేతనైతే నాతో కొట్లాడండి తప్పులు చేస్తే చెప్పండి సరిదిద్దుకొంటున్నా అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 లోపల 2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వారికి స్థానిక ఎన్నికలలో గుర్తించి టికెట్ ఇప్పిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: అంబానీ రేంజ్ అట్లుంటుంది మరి..ఏకంగా ఐఏఎఫ్ రంగంలోకి దిగిందిగా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు