CM Revanth Reddy: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు TG: కేంద్రం మరోసారి అధికారంలో వస్తే రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు. By V.J Reddy 26 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: జహీరాబాద్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దొర గడీలు బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని బంధ విముక్తి కల్పించిన ఘనత మీదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ప్రజా పాలన కొనసాగించుకుంటున్నాం.. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటున్నాం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం అని పేర్కొన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.. రూ.500 లకే పేదలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చి 40లక్షల కుటుంబాలను ఆదుకున్నాం.. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి మీ కళ్లల్లో ఆనందం చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారు... అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.22,500 కోట్లు మంజూరు చేశామని అన్నారు. ఇంటి నిండా ఉద్యోగాలు ఇచుకున్న కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి.. వారికి దామాషా ప్రకారం అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. బీసీ జనగణన చేపడితేనె వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందుతాయి.. అందుకే బీసీ జనగణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించుకున్నాం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్.. * మేమిద్దరం మాకు ఇద్దరు అన్నట్లు.. మోడీ, అమిత్ షా కు ఆదాని, అంబానీ తొడయ్యారు.. వాళ్లంతా కలిసి రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్నారు.. * బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటిష్ జనతా పార్టీ... * మతాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దోచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.. * రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది.. * మోడీ కాలనాగు లాంటి వాడు... మనసులో పగ పెట్టుకుంటారు.. * నల్ల చట్టాలపై కొట్లాడిన రైతులపై మోదీ పగ పట్టారు.. * రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రైతులను ఆదాని, అంబానీలకు బానిసలుగా మార్చాలని చూస్తున్నారు.. * 400 సీట్లు గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు.. * పదేళ్లు మోసం చేసిన వారికి ఓటేస్తారా.. వంద రోజుల్లో మీకు సంక్షేమం అందించిన వారికి ఓటేస్తారా ఆలోచించండి.. #brs #cm-revanth-reddy #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి