Rythu Bandhu: వారికి రైతుబంధు కట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం! రైతు బంధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ట్యాక్స్ పేయర్స్‌కు రైతు భరోసా (రైతు బంధు) సాయాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నామని.. అసెంబ్లీలో చర్చించి దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. By V.J Reddy 05 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rythu Bandhu: మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు మా పరిపాలనకు రెఫరెండం అని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష నేత లేడని.. ఉంటే అసెంబ్లీకి వచ్చే వాడని మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంపై సీఎం రేవంత్ స్పందించారు. RS ప్రవీణ్ కుమార్ తమకు మిత్రుడు కాదని తేల్చి చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అన్నారు. ALSO READ: బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు నా కుటుంబం నుంచి నో ఛాన్స్.. తనను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన కుటుంబం నుంచి రాజకీయాల్లో వస్తున్నారనే వార్తలను ఖండించారు. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారు అని తేల్చి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతోనే టికెట్‌లు ప్రకటించాయని ఆరోపణలు చేశారు. మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎల్లుండి సీఈసీ మీటింగ్, అదే రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు అని అన్నారు. తుమ్మిడిహట్టి నిర్మించి ఆదిలాబాద్‌కు నీళ్లు ఇస్తాం అని అన్నారు. ALSO READ: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్ వారికి రైతు బంధు కట్... రైతు బంధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ట్యాక్స్ పేయర్స్‌కు రైతు భరోసా (రైతు బంధు) సాయాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నామని.. అసెంబ్లీలో చర్చించి దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక ఆదాయం పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ ఆదాయం రూ.500 కోట్లు పెరిగిందని పేర్కొన్నారు. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలపై విచారణ జరుపుతాం అని అన్నారు. #cm-revanth-reddy #lok-sabha-elections #congress-party #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి