TG Assembly: బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ సంచలన సవాల్ TG: అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ స్కీమ్, కేసీఆర్ కిట్లు పథకాల అవకతవకలపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. By V.J Reddy 27 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతికపక్షాల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. బతుకమ్మ చీరలు (Bathukamma Sarees), గొర్రెల స్కీమ్ (Sheep Distribution Scheme), కేసీఆర్ కిట్లు పథకాల (KCR Kits) అవకతవకలపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి చేశారని అన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లలోనూ భారీగా అవినీతి జరిగిందని చెప్పారు. సూరత్ నుంచి నాసిరకం చీరలు తీసుకొచ్చి తెలంగాణ మహిళలకు ఇచ్చారని అన్నారు. రూ.వేలకోట్ల భూములను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. సభలో అన్ని లెక్కలు బయటకు తీస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. Also Read: కవిత, కేజ్రీవాల్ ఉన్న జైలులో కొట్టుకున్న ఖైదీలు #brs #congress #cm-revanth-reddy #telangana-budget-2024 #telangana-assembly-sessions-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి