Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే... రేవంత్ కీలక ఆదేశాలు

అభయాహస్తం ఆరు గ్యారెంటీల అమలు కోసం స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే వాటిని పక్కన పెట్టోద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

New Update
CM Revanth Reddy: వాటిని మాకు మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌ వినతి..

Praja Palana Applications: కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయ తలపెట్టిన ఆరు గ్యారెంటీల (6 Guarantees Scheme)  కోసం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఆరు గ్యారెంటీల కోసం రాష్ర్ట వ్యాప్తంగా కోటికి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలాఖరులోగా డేటా ఎంట్రీ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే వాటిని పక్కన పెట్టొద్దని అధికారులకు సూచించారు. అవసరమైన వివరాల కోసం దరఖాస్తుదారునికి ఫోన్ చేసి సరైన సమాచారం కనుక్కుని డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసిన తరువాతే వాటిని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

జనవరి నెలాఖరు వరకు డేటా ఎంట్రీ పూర్తిచేసి అర్హులైన వారందరికీ గ్యారెంటీలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజాపాలన దరఖాస్తుల తదుపరి కార్యాచరణ, విధివిధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అర్హులను ఎంపికచేసి అభయహస్తం పథకాలను (Abhaya Hastham) అందజేయనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నేతృత్వంలో క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయగా ఇందులో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్లశ్రీధర్‌బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి వచ్చిన దరఖాస్తుల్లో ఏఏ పథకానికి ఎవరెవరు అర్హులనేది తేల్చనుంది. మరోవైపు ఇప్పటికీ చాలామంది ప్రజలు అభయాహస్తం ఆరు గ్యారెంటీల కోసం తాము దరఖాస్తు చేసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మంత్రివర్గ ఉపసంఘం స్పిందించింది.  ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం దరఖాస్తులు సమర్పించని వారు...ఆందోళన చెందొద్దని... ప్రతీ నాలుగు నెలలకోసారి ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.

Also Read: జాతీయ యువజన దినోత్సవం.. ప్రధానీ మోదీ కీలక వ్యాఖ్యలు

ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీని వేగవంతం చేశారు. దీనికోసం ప్రైవేటు సంస్థలు, ఆపరేటర్లను నియమించింది. అయితే ఎంట్రీకోసం దరఖాస్తులను తరలించే క్రమంలో అనేక లోపాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు రోడ్లపాలయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో దరఖాస్తుల్లో తప్పుల సరి పేరుతో సైబర్‌ నేరగాళ్లు సామాన్యులకు వల విసిరి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ లోపాలను సరిచేస్తూ అర్హులైన ప్రజలందరికీ గ్యారెంటీలను అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

#cm-revanth-reddy #congress-six-guarantees #praja-palana #praja-palana-application
Advertisment
Advertisment
తాజా కథనాలు