CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యూహం.. కేసీఆర్‌కు బిగ్ షాక్ తప్పదా?

TG: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పోచారం. ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్‌ రెడ్డి, పొంగులేటి.

New Update
Pocharam : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Big Shock To KCR : తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను, కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన్ను కాంగ్రెస్‌ (Congress) లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్‌ రెడ్డి, పొంగులేటి. బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పోచారం. గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై అసంతృప్తిగా  ఉన్న ఆయన పార్టీ మారుతారా? లేదా? అనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

కేసీఆర్ కు రేవంత్ ఝలక్..

లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) ఎప్పుడు వచ్చిన 'కారు- సారు-పదహారు' అంటూ ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ (BRS) పార్టీకి, పార్టీ శ్రేణులకు ఈ లోక్ సభ ఎన్నికలకు గట్టి షాక్ ఇచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. మొత్తం 17 స్థానాల్లో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి కోలుకొని మాజీ సీఎం కేసీఆర్ కు లోక్ సభ ఎన్నికల ఫలితాలు పెద్ద గండంగా మారాయి. ఇప్పటికే నేతల ఫిరాయింపులతో అల్లాడుతున్న కేసీఆర్ కు నేతల కాపాడుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారో తెలియక గందరగోళంలో ఉన్నారు. రేవంత్ వేసే అడుగులు కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. తాజాగా పోచారం ను కలవడంతో ఆయన కూడా పార్టీ మారుతున్నారనే చర్చ నెలకొంది.

Also Read : సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బెయిల్ రద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు