CM Revanth Reddy: 'బలగం' చిత్రబృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

69వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ అవార్డుల్లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం. రేవంత్ రెడ్డి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

New Update
CM Revanth Reddy: 'బలగం' చిత్రబృందానికి  సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

CM Revanth Reddy: 69వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ అవార్డుల్లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం. రేవంత్ రెడ్డి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అలాగే ఉత్తమ నటీనటులుగా హీరో నాని, కీర్తి సురేష్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్( శ్రీకాంత్ ఓదెలు) సహా అనేక కేటగిరీల్లో అవార్డులు పొందిన దసరా చిత్ర బృందాన్ని కూడా సీఎం అభినందించారు. అవార్డులు అందుకున్న అందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబ అనుబంధాలను చాటుతూ తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం #FilmfareAwardsSouth ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా @VenuYeldandi9 సహా పలు కేటగిరీల్లో అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి @revanth_anumula గారు హర్షం వ్యక్తం చేశారు. #Balagam చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

అలాగే,… pic.twitter.com/w161VcliJr

— CPRO to CM / Telangana (@CPRO_TGCM) August 4, 2024

కేటీ ఆర్ అభినందనలు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌  ప్రెసిడెంట్ కేటీ ఆర్ కూడా బలగం చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. "నా సోదరుడు వేణుయేల్దండికి అభినందనలు. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిలమని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాధించే ఇది తొలిమెట్టు అని చెప్పారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా Filmfare అవార్డును అందుకోవడం పై సంతోషం వ్యక్తం చేశారు. ఇది మీ కష్టానికి దక్కిన ప్రశంసలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాదించేందుకు ఇది తొలి మెట్టని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు."

Also Read: Nayanthara : వయనాడ్ విపత్తుకు నయనతార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం.! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment