Rythu Runa Mafi: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్

మేడారం జాతరలో పాల్గొన్న సీఎం రేవంత్ కీలక ప్రకటనలు చేశారు. త్వరలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులకు శుభవార్త అందిస్తామని అన్నారు. అలాగే మార్చి 2న 6వేల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని అన్నారు. ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

New Update
Rythu Runa Mafi: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్

CM Revanth Reddy: మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నట్లు తెలిపారు. ములుగు జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. మంత్రి సీతక్కతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభించానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించినట్లు గుర్తు చేశారు.

మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది రాకుండా రూ.110 కోట్లను తమ ప్రభుత్వం మంజూరు చేసినట్లై పేర్కొన్నారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడు ఎవరో ఒకరు నిలబడతారని హితవు పలికారు. సమ్మక్క, సారలమ్మ నుంచి స్ఫూర్తి పొంది పోరాడాం అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.

త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ..

మేడారం జాతరలో పాల్గొన్న సీఎం రేవంత్ ప్రజలకు తీపి కబురు అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పమని.. మరికొన్ని రోజుల్లోనే రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలనలు మాఫీ చేస్తామని తేల్చి చెప్పారు. రుణమాఫీ ప్రక్రియపై తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని.. బ్యాంకు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులు గుడ్ న్యూస్ వింటారని చెప్పారు.

6వేల ఉద్యోగాలు భర్తీ..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమాయంలో అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సీఎం రేవంత్. ఈ క్రమంలో మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణలోని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని భరోసా ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు