MEGA DSC : త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు

రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ప్రతి ఊరికి ఒక బడి ఉండాలని అన్నారు.

New Update
Telangana : రాష్ట్రంలో నేటి నుంచి పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

Telangana Teacher Jobs : తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అన్ని శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. తాజాగా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. పలు నిర్ణయాలను తీసుకొని అందరిని తన వైపు తిప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని సీఎం ఆదేశంచారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ALSO READ: రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

మెగా డీఎస్సీ రంగం సిద్దం..

తెలంగాణలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ(Mega DSC) నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు.

ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో(Teacher Transfers) ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.

ALSO READతెలంగాణ ప్రజలకు అలెర్ట్.. 2 రోజులు దరఖాస్తులు బంద్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam ప్రకృతి అందాలతో పహాల్గమ్.. ఇక్కడ టాప్ 10 పర్యాటక ప్రదేశాలు చూస్తే మతిపోతుంది!

నిన్న జరిగిన ఉగ్రవాద దాడితో జమ్మూకాశ్మీర్ లోని పహాల్గమ్ ప్రదేశం పేరు మారుమోగుతోంది. మినీ స్విట్జర్ ల్యాండ్ గా పేరొందిన పహల్గామ్ మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, నదులతో ఉత్సాహభరితమైన ప్రకృతి దృశ్యాలను తలపిస్తుంది. పహాల్గమ్ లోని కొన్ని సుందరమైన పర్యాటక ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack)

Advertisment
Advertisment