CM Revanth: కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. ఆ బకాయిలపై కీలక చర్చ! ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి జోషిని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. గ్యాస్ రాయితీని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ముందే చెల్లించే అవకాశాన్ని కల్పించాలని హర్ దీప్ సింగ్ ను విజ్ఞప్తి చేశారు. By srinivas 22 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Pralhad Joshi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని జోషిని కోరారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1468.94 కోట్ల రాయితీని విడుదల చేయాలని అడిగారు. Your browser does not support the video tag. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు సంబంధించి 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్లను రిలీజ్ చేయాలని గుర్తు చేశారు. అలాగే 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి: Shanthi-Madan: శాంతి ఉద్యోగం ఊస్ట్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు! ఈ క్రమంలోనే పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని కూడా కలిశారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తదితర అధికారులున్నారు. #cm-revanth #hardeep-singh-puri #pralhad-joshi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి