CM Revanth Reddy: తమ్మినేని, గడ్డం ప్రసాద్‌లను పరామర్శించిన సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌లను పరామర్శించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గడ్డం ప్రసాద్‌ను.. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమ్మినేనిని పరామర్శించారు.

New Update
CM Revanth Reddy: తమ్మినేని, గడ్డం ప్రసాద్‌లను పరామర్శించిన సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌లను వేరువేరుగా వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన వేడుకలకు రేవంత్‌ హాజరయ్యారు. ఆ తర్వాత న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. అక్కడ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిసి పరామర్శించారు. ఇటీవలే గడ్డం ప్రసాద్‌ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.

Also Read: గణతంత్ర వేడుకల్లో అపశృతి.. అస్వస్థకు గురైన మాజీ హోంమంత్రి మమమూద్ అలీ

మరోవైపు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ పరామర్శించారు. ప్రస్తుతం తమ్మినేని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నేరుగా ఆసుపత్రికి వెళ్లిన సీఎం తమ్మినేనిని పరామర్శించి ఆయన ఆరోగ్య వివరాల గురించి తెలుసుకున్నారు. అయితే ఇటీవల తమ్మినేని వీరభద్రంకు స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ముందుగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్చగా.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

గతంలోనే గుండెపోటు

తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల నుంచి నీరును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల డాక్టర్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తమ్మినేనికి లంగ్స్ ఇన్ఫెక్షన్ తోపాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గతంలో కూడా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. దీంతో అప్పుడు ఆయనకు స్టంట్ వేశారు. తాజాగా.. మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో ఆందోళన నెలకొంది.

Also Read: నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై

Advertisment
Advertisment
తాజా కథనాలు