Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎవో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో కార్మికులు కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారు. By BalaMurali Krishna 26 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎవో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో కార్మికులు కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్ గా కార్మికులకు అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ గారికి కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది" అని ఆమె పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్ గా కార్మికులకు అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ గారికి కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు… pic.twitter.com/FtOJTfdb9g — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 26, 2023 ఇటీవల సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం జమ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల సర్వీస్ సీనియారిటీని బట్టి వారి ఖాతాల్లో నగదు జమ అయింది. ఒక్కో కార్మికుడికి ఏరియర్స్ రూపంలో దాదాపు రూ.3.70 లక్షల వరకు క్రెడిట్ అయ్యింది. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు రావడంతో కార్మికులు తెగ సంబరిపడిపోయారు. ఇప్పుడు 32శాతం బోనస్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే దసరా పండుగకు ముందే లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్ కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని యాజమాన్యం ప్రకటించింది. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్‌ను దసరా కన్నా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంది. పెద్ద మొత్తంలో వచ్చిన ఈ నగదును కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. యాజమాన్యం ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలబడుతుందని వెల్లడించింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బిగ్ రిలీఫ్ .. నవంబర్ 20 తర్వాత నెక్ట్స్ ఏంటి? #kcr #kavitha #singareni-employees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి