CM KCR: కేసీఆర్ దసరా శుభాకాంక్షలు.. ఈ పండుగ తెలంగాణకు స్పెషల్ అన్న సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగకు తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. దసరా నాడు శమీ పూజ, అలాయ్ బలాయ్, పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం అన్నారు. By Nikhil 23 Oct 2023 in తెలంగాణ New Update షేర్ చేయండి దసరా పండుగను (Dasara Festival) పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (TS CM KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను 'విజయ దశమి' పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు. దసరా నాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని సీఎం అన్నారు. ఇది కూడా చదవండి: Dussera 2023: దసరా రోజు జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు…పాలపిట్టను ఎందుకు చూడాలి! శమీ పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, అగ్రపథాన కొనసాగించేందుకు విజయ దశమి స్ఫూర్తితో అలుపెరుగని ప్రయత్నం కొనసాగుతోందని సీఎం అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. #HappyDasara pic.twitter.com/lqdqZYoMPd — Telangana CMO (@TelanganaCMO) October 23, 2023 తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని సీఎం కేసీఆర్ దుర్గామాతను ఈ సందర్భంగా ప్రార్థించారు. #telangana #cm-kcr #dussehra-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి