CM Jagan: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ! ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను తాడేపల్లి క్యాంపు నుంచి నేరుగా వారి ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేయనున్నారు. By V.J Reddy 20 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి CM Jagan: జగన్ ప్రభుత్వం విదేశాల్లో చదువుకోవాలనే ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు జగనన్న విదేశీ విద్యా దీవెన (jagananna videshi vidya deevena) పథకం నగదును విడుదల చేయనుంది. అలాగే సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను కూడా ఈ రోజు అందించనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 41.6 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ పథకం ద్వారా మొత్తం 390 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఇటీవల జరిగిన సివిల్ సర్విసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో మెరిట్ సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.5 లక్షలను మొత్తం రూ.42.6 కోట్లను ఈ రోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్. ALSO READ: కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్…కేటీఆర్ ఆన్ ఫైర్! నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశం.. ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ చేపట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వం యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై వారికి దిశానిర్దేశం ఇవ్వనున్నారు. చేపట్టాల్సిన ఏర్పాట్లు, యువతను ఈ కార్యక్రమాల్లో పాల్గొన చేసేందుకు చేపట్టాల్సిన విషయాలపై వారితో చర్చించనున్నారు. విజయవాడకు సీఎం జగన్.. సీఎం జగన్ ఈ రోజు విజయవాడలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. సీఎం రాకతో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ALSO READ: తెలంగాణలో మరో నాలుగు కరోనా కేసులు.. #ap-news #cm-jagan #ycp-party #jagananna-videshi-vidya-deevena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి