CM Chandrababu : నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన అనంతరం హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం కానున్నారు.

New Update
AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

Konaseema District : ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు (Chandrababu). కొత్తపేట మండలం వానపల్లిలో స్వర్ణ గ్రామపంచాయతీ గ్రామసభలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి తన నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా బయల్దేరనున్నారు. 11 గంటల 40 నిమిషాలకు అయినవిల్లి ఎలిఫెంట్ వద్దకు చేరుకుంటారు. అక్కడనుండి రోడ్డు మార్గంలో వానపల్లి చేరుకోనున్నారు సీఎం.

స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గ్రామాలకు కావలసిన మౌలిక వసతులపై మాట్లాడనున్నారు. గ్రామస్తులతోనూ స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. వానపల్లి నుండి రోడ్డు మార్గంలో అయినవిల్లి హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. హెలికాప్టర్ లో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ (Rajahmundry Airport) కి చేరుకుంటారు. అక్కడనుండి విమానంలో హైదరాబాద్ (Hyderabad) వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.

Also Read : ఏపీలో మరో భారీ ప్రమాదం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anakapalli Fire Accident: అనకాపల్లిలో దారుణం.. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు- స్పాట్‌లో 5గురు మృతి

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది.

New Update
Fire Accident  in america

Fire Accident in Anakapalli Kailasapatnam

అనకాపల్లిజిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది.

(fire accident | anakapalli | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment