Cleaning Tips: రాగి బాటిల్స్‌ను క్లీన్ చేసే చిట్కాలు.. ఇలా చేస్తే సులభంగా జిడ్డు పోతుంది! By Vijaya Nimma 24 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపుతున్నారు. రాగి పాత్రల్లో నీటిని తాగుతున్నారు. ఈ మధ్యకాలంలో రకరాల బ్రాండ్ల పేరుతో కాపర్ వాటర్ బాటిల్స్ మార్కెట్‌లో లభిస్తున్నాయి. చాలా మంది వీటిని కొనుగోలు చేసి ట్రావెలింగ్‌లో ఉపయోగిస్తున్నారు. రాగి పాత్రల్లో నీళ్లు తాగడంతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. పాత రోజుల్లో మన పెద్దలు నీళ్లు తాగడానికి రాగి చెంబులను వాడేవాళ్లు, ఇళ్లలో కూడా రాగి బిందెలను వినియోగించేవాళ్లు. సులభంగా కాపర్ బాటిల్ క్లీన్ రాత్రంతా రాగి బాటిళ్లలో నిల్వ చేసిన నీటిని తాగితే ఎంతో ఆరోగ్యకరం. ఇలా రాగి పాత్రల్లో నీటిని తాగితే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా నీళ్లలోని వైరస్‌లు, క్రిములు, బ్యాక్టీరియాలు చనిపోతాయి. అంతేకాకుండా మన బాడీలోని మలినాలు కూడా తొలగుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎక్కువగా రాగి బాటిల్స్‌ను వాడితే అవి నల్లగా మారుతూ ఉంటాయి. అడుగు భాగంలో పాచి కూడా పేరుకుపోతుంది. మామూలు బాటిళ్లు అయితే సులభంగా క్లీన్ అవుతాయి. కానీ రాగి వాటిపై ఉండే నలుపు పోవడం కాస్త కష్టమే. మెరిసిపోవాలంటే ఇలా ట్రై... రాగి బాటిల్స్ మెరిసిపోవాలంటే వెనిగర్‌లో ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత దాన్ని బాటిల్‌పై రాసుకోవాలి. 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత కడుక్కుంటే జిడ్డు పోతుంది. తర్వాత వెనిగర్, ఉప్పు మిశ్రమాన్ని బాటిల్‌లో వేసి బాగా షేక్ చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు ఉంచి కడగాలి. ఇలా చేస్తే బాటిల్‌లోని మలినాలు పోయి శుభ్రంగా మారుతుంది. రాగి పాత్రలను కడిగేందుకు నిమ్మరసం కూడా బాగా ఉపయోగపడుతుంది. రాగి బాటిల్స్‌పై నిమ్మ రసం వేసి బాగా రుద్ది కడిగితే నలుపు పోతుంది. బాటిల్‌లోపల నిమ్మ రసం వేసి బ్రష్‌తో బాగా రుద్దాలి. రాగి బాటిల్‌లో గోరువెచ్చని నీళ్లు వేసి ఉప్పు, నిమ్మ చెక్కలు, వెనిగర్ అందులో వేసి అరగంట ఉంచి కడిగితే బాటిల్స్ బాగా శుభ్రంగా మారుతాయి. ఇది కూడా చదవండి: విటమిన్ -బి12 లోపంతో వచ్చే సమస్యలేంటి? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. WATCH: #life-style మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి