Muddanur: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు.. కడపలో ఉద్రిక్తత ఏపీ జమ్మలమడుగులో హై టెన్షన్ వాతారణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నారు. శశిధర్ రెడ్డి టీడీపీలో చేరడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం శశి చేరికను అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. By srinivas 31 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి TDP Vs YCP in Kadapa : ఉమ్మడి కడప, ప్రస్తుత వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని ముద్దనూరులో ఉద్రిక్త వాతారణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకున్నారు. పోలీసుల ముందే కుర్చీలు, కర్రలు, రాళ్లతో రువ్వుకుని ఘర్షణకు దిగారు. అంతేకాదు శశిధర్ రెడ్డి (Shashidhar Reddy) ఇంటిలో ఉన్న టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) అనుచరులు దాడులకు పాల్పడ్డారు. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో 20 మందికి పైగా గాయలయ్యాయి. ఇది కూడా చదవండి : Kumari Aunty: కుమారీ ఆంటీకి రేవంత్ గుడ్ న్యూస్.. స్ట్రీట్ ఫుడ్ రీఒపెన్.. శశిధర్ రెడ్డి టీడీపీలో చేరడమే.. అయితే ఈ గొడవకు కారణం ముద్దునూరు వైసీపీ ఇంఛార్జ్ ముని రాజారెడ్డి తమ్ముడు శశిధర్ రెడ్డి ఇటీవల టీడీపీలో (TDP) చేరడమే. కాగా ఆయన అనుచరులు సైతం టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శశి చేరికను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడగా సమాచారం అందుకున్న పోలీసులు ముద్దనూరులో భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు తెదేపా ఇన్‌ఛార్జ్ భూపేష్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఆయన్ను అడ్డుకుని పీఎస్‌కు తరలించారు. #kadapa #tdp-vs-ycp #shasidhar-reddy #sudhir-reddy #jammalamadugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి