Bibinagar: కోమటి రెడ్డి, సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్

కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. గూడూరు గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సంలో కేసీఆర్, కేటీఆర్ పై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను సందీప్ రెడ్డి ఖండించడంతో గొడవ మొదలైంది.

New Update
Bibinagar: కోమటి రెడ్డి, సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్

Komatireddy: కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి దురుసు ప్రవర్తనతో వారల్లో నిలిచారు. భువనగిరి జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై అందరిముందే చిందులేశారు. ఇక అసలు విషయానికొస్తే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూడూరు గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సంలో సోమవారం పాల్గొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం జెడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే సభపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి ఏ ఎమ్మెల్యే కాదని, తానే స్వయంగా రాజకీయంగా ఎదిగి మంత్రి అయ్యానన్నారు.

అలాగే అంటా..
ఈ క్రమంలో పక్కనే ఉన్న సందీప్ రెడ్డిని ఉద్దేశిస్తూ దివంగత నేత మాధవరెడ్డి పేరు చెప్పుకొని సందీప్ రెడ్డి జెడ్పీటీసీగా గెలిచారని, లేదంటే సర్పంచ్ కూడా అయ్యేవాడు కాదంటూ విమర్శలు చేశారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను సందీప్ రెడ్డి ఖండించారు. మంత్రిగా ఉండే ఇలా ఓ జెడ్పీ ఛైర్మన్ ను అవమానిస్తారా అంటూ అక్కడే నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన కోమటిరెడ్డి అలాగే అంటానంటూ తన దురుసుగా వ్యవహరించారు. పోలీసులకు చెప్పి స్టేజీపై నుంచి తీసుకెళ్లాండి అంటూ ఆర్డర్ జారీ చేయగా.. పోలీసులు సందీప్ రెడ్డిని స్టేజీ పైనుంచి దూరంగా తీసుకెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: AP: ఫిబ్రవరి 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

కాలు గోటికి కూడా సరిపోడు..
అలాగే ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ మీ భాష మార్చుకోండి. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలు గోటికి కూడా సరిపోడు అంటావా.. కాలి గోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పెట్టాడా అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన మూడో రోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారు కానీ మీరు ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కాలి గోటికి సరిపోని రేవంత్ రెడ్డి మిమ్మల్ని తొక్కితే 50వేల ఓట్లతో ఒక్కొక్కరు ఓడిపోయారు. కాంగ్రెస్ చేసేదే చెప్తది.. మీలాగా పూటకో మాట చెప్పదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు. కొండమడుగులో కాలుష్య పరిశ్రమలు తీసివేసి రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తాం. కేసీఆర్ యాదాద్రి నుంచి ఫామ్ హౌస్ కు పోతుంటే వాసాలమర్రిలో రోడ్డుకు స్మశానవాటిక అడ్డంగా ఉందని గ్రామాన్ని దత్తత తీసుకొని వదిలేశాడంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు