టాలీవుడ్ సీనియర్ స్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో 'విశ్వంభర' ఒకటి, ఇది సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతోంది. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా 'విశ్వంభర' టీజర్‌కు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ లో VFX షాట్స్, గ్రాఫిక్స్ ఏమాత్రం బాలేదని ఆడియన్స్ నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. Also Read : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా? దింతో చిత్ర బృందం ఏకంగా సీజీ టీమ్‌ను మార్చి, కొత్త టీమ్‌తో గ్రాఫిక్స్ పనులు చేపట్టినట్టు సమాచారం. అయితే, ఈ వార్తపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఈ మార్పుల కారణంగా, విశ్వంభర ట్రైలర్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. 2025 జనవరి 10న విడుదల చేయాలని మొదట ప్లాన్ చేసినా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. Also Read : అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే? కొత్త విడుదల తేదీపై త్వరలోనే మేకర్స్ స్పష్టత ఇవ్వనున్నారు. సమ్మర్ కానుకగా మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.