మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'లైలా'. గతేడాది విశ్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను అలరించలేకపోయింది. దీంతో ఈసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి 'లైలా' అంటూ వస్తున్నాడు. పలకరించనున్నాడు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'లైలా' టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. టీజర్ చివర్లో విశ్వక్ లేడీ గెటప్ అదిరిపోయింది. అమ్మాయిగా చాలా అందంగా కనిపించాడు.
Welcome to the world of #Laila filled with fun, action and romance ❤🔥
— Shine Screens (@Shine_Screens) January 17, 2025
The Echipaad #LailaTeaser out now 💥💥
▶️ https://t.co/69A8iTkJSX
GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹
'Mass Ka Das' @VishwakSenActor @RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7… pic.twitter.com/mauOY6ekVj
'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు' అనే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్ తో సినిమాలో పక్కా మాస క్యారెక్టర్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. సినిమాలో విశ్వక్ సేన్ బార్బర్ సోను మోడల్, లైలా అనే రెండు పాత్రల్లో ఇందులో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున ఈ సినిమా విడుదల కానుంది.
సోషల్ మీడియాలో టీజర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. విశ్వక్ సేన్ కు లేడీ గెటప్ బాగా సూట్ అయిందని కొందరు అంటుంటే.. ఓ మాస్ హీరోతో లేడీ గెటప్ వేయించడం అనేది అరాచకం అయ్యా! అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ కూడా ఈ రోల్ యాక్సెప్ట్ చేయడం సినిమాపై అతనికున్న డెడికేషన్ ఏంటో అర్థమవుతోంది. అతని తోటి హీరోలు ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగం చేయకపోవడం గమనార్హం.