/rtv/media/media_files/2025/02/15/Zzjwo3P0sYveGa8MBt2q.jpg)
vishwak sen laila movie streaming soon on ott platform amazon prime video
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ చిత్రం ఎన్నో వివాదాల మధ్య ఇటీవల విడుదలైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో వన్ మ్యాన్ షో చేసినప్పటికీ ఈ చిత్రం సినీ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు.
Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!
నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సాహు గారపాటి నిర్మించారు. ఫస్ట్ నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్నా.. బొమ్మ పడేసరికి మాత్రం అబ్బే అంతా డొల్ల అన్నట్లు అనిపించిందని సినీ ప్రియులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఒక్కరోజుకే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు
ఓటీటీలోకి ‘లైలా’
ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన టాక్ బట్టి చూస్తే.. దానికంటే ముందుగానే ‘లైలా’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల చివరి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్
రిలీజ్‌కు ముందు చిచ్చు
కాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో నటుడు పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపాయి. వైసీపీ పార్టీని ఉద్దేశించి ఆయన చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ ఫ్యాన్స్ ‘బాయ్‌కట్ లైలా’ అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేశాయి. దీంతో ఈ సినిమాకి అక్కడ నుంచే నెగిటివిటీ పెరిగింది.