/rtv/media/media_files/2025/02/11/nTOW5CJdXWUo1C1Kr8d6.jpg)
Boycott laila Photograph: (Boycott laila)
Laila Movie: వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన విశ్వక్ సేన్ 'లైలా' ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రమోషన్స్ తో ఫుల్ హైప్ ఎక్కించినప్పటికీ.. కంటెంట్ పరంగా ఘోరంగా నిరాశపరిచింది. సినిమాలో కథ, కథనం రెండూ లేవని ప్రేక్షకులు పెదవి విసురుతున్నారు.
రెండు మూడు రోజుల్లో సినిమా ఆగిపోతుందని తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ప్రస్తుతం BookMyShowలో అన్ని స్క్రీన్లు దాదాపు ఖాళీగా కనిపిస్తున్నట్లు సమాచారం. శనివారం వీకెండ్ అయినప్పటికీ బుకింగ్స్ లేకపోవడం నిరాశాజనకం.
Also Read : Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా!
పూర్తి రన్ ముగిసినట్లే
అంతేకాదు ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచే విధంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు 'లైలా' అంతటా కలిపి కేవలం రూ. కోటి వసూళ్లను మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇక సినిమా పూర్తి రన్ ముగిసినట్లే అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. విశ్వక్ సేన్ స్త్రీగా ద్విపాత్రాభినయం చేసిన 'లైలా' యూత్ ని బాగా ఆకర్షిస్తుందని భావించారు. కానీ కంటెంట్ లేకపోవడంతో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. గామీ, ధమ్కీ సినిమాలతో డీసెంట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ కి.. ఈ సినిమాతో సాలిడ్ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది.
Also Read: Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!
బాయ్‌కాట్ లైలా
అయితే విడుదలకు ముందే నటుడు పృథ్వీ కామెంట్స్ తో విపరీతమైన కాంట్రావర్సి ఎదుర్కొంది ఈ సినిమా. వైసీపీ ఫ్యాన్స్ బాయ్‌కాట్ లైలా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో సినిమాపై ఇంపాక్ట్ పడుతుందని చిత్ర యూనిట్‌తో పాటు, పృథ్వీ సైతం వైసీపీకి క్షమాపణలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read: Monalisa Dance Viral Video: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!